Followers

Showing posts with label CRIME. Show all posts
Showing posts with label CRIME. Show all posts

కర్ఫ్యూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

 కర్ఫ్యూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

ఎస్.ఐ.ఫకృద్ధీన్,

సాలూరు, పెన్ పవర్

ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిర్ణయించిన కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని సాలూరు పట్టణ ఎస్.ఐ.ఫకృద్ధీన్ సూచించారు. పట్టణంలో గురువారం పట్టణ ఎస్.ఐ కర్ఫ్యూ నిబంధనలు తెలియజేస్తూ దగ్గర ఉండి షాపులను మూయించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ఫ్యూని పాటిద్దాం కరోనాని తరిమిద్దాం, మాస్కు ధరించు భౌతిక దూరం పాటించు శుభ్రత వహించు, నిర్లక్ష్యంగా ఉండకు కరోన బారిన పడకు, అనవసరంగా బయటకు రాకు కరోనాని ఆహ్వానించకు, మీ రక్షణ కోసం మేము రోడ్లుపై ఉన్నాము, మనందరి కోసం బయటకు రావాద్దు అంటూ పట్టణంలో మెయిన్ రోడ్డు గుండా ప్లేకార్డులుతో తమ సిబ్బందితో కలసి ప్రదర్శన చేశారు. సాలూరు సి.ఐ.అప్పలనాయుడు మరియు మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణ లో కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ 12 గంటలకే షాపులన్నింటిని మూసివేయించడం జరిగింది అని ఎస్.ఐ ఫకృద్దీన్ తెలిపారు. అలాగే స్థానిక స్టేట్ బ్యాంకు లో భౌతిక దూరం పాటించాలని అక్కడ ఉన్న బ్యాంకు వినియోగదారులకు సూచించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నాటుసారాకు ఉపయోగించే 1200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

 నాటుసారాకు ఉపయోగించే 1200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

గోపాలపురం, పెన్ పవర్

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏలూరు, ఏఎస్పీ మరియు ఏసి వారి అదేశాలమేరకు పోలవరం ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మరియు తమ సిబ్బంది బుధవారం తనిఖీల్లో భాగంగా గోపాలపురం మండలం కొవ్వాడ ప్రోజెక్టు ఏరియా బుచ్చియ్యపాలెం గ్రామంలో నాటుసారా కు ఉపయోగించే 1200 లీటర్ల బెల్లం ఊట పట్టుబడింది. ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ పట్టుబడిన బెల్లం ఊటను తమ సిబ్బంది సహాయంతో ధ్వంసం చేసినట్లు తెలిపారు.

గిరిజన ‌ బంధువులను దూరం చేస్తున్న కరోనా

గిరిజన ‌ బంధువులను  దూరం చేస్తున్న కరోనా

చింతూరు,  పెన్ పవర్

గిరిజనుల్లో లో శుభకార్యాలు జరిగినా, అశుభ కార్యాలు జరిగినా ఒక పండుగ జరిగినా బంధువులందరూ పెద్ద ఎత్తున వేడుకకు రావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో కరోనా కు గురై మృతి చెందిన గిరిజనుల కుటుంబాల వద్దకు బంధువులు ఎవరూ రాకపోవడం హృదయవిదారకమైన విషయం. చింతూరు మండలంలో ఇంచుమించు ప్రతి గ్రామానికి కరోనా సోకింది. ప్రతి గ్రామంలోనూ లాక్ డౌన్ విధించటం గ్రామంలో శానిటేషన్ చేయించటం సెక్రటరీల పని వంతు అయింది. 12:00 తర్వాత లాక్ డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  ఆజ్ఞలు జారీ చేసింది. గత రాత్రి  మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సోడి కాంతమ్మ (50) కరోనాతో చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందింది. కాంతమ్మ మృతదేహానికి  సంస్కారాలు చేయడానికి బంధువులు ఎవరూ రాలేదు. కాంతమ్మ మరిది కొడుకులు మరో వ్యక్తి అంతిమ సంస్కారాలు చేశారు. కరొన తీవ్రతరం కావడంతో ప్రతి ఒక్కరూ జంకుతున్నారు. అంతిమ సంస్కారాలు చేయడానికి తన సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇది హృదయ విదారక దృశ్యం.


శేషగిరి మరణం విద్యారంగానికి తీరని లోటు...

 శేషగిరి మరణం విద్యారంగానికి తీరని లోటు...

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

  నిరంతరం ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ నేత,యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోరెడ్ల శేషగిరి కరోనా తో అకాల మరణం చెందడం విద్యారంగానికి తీరని లోటని, ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శేషగిరి సామాజిక స్పృహ కలిగిన నాయకుడని, ఉపాధ్యాయుల సంక్షేమం  కోసం, కార్మిక వర్గాల హక్కుల కోసం,ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేశారన్నారు. గురజాడ అధ్యయన వేదిక పక్షాన పలు సామాజిక అంశాలపై చర్చా వేదికలు నిర్వహిస్తూ చైతన్యం కోసం కృషి చేశారన్నారు. ఇటీవల విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఉద్యోగ,కార్మిక సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుండి నడిపించారన్నారు. అంతే కాకుండా శేషగిరి విద్యారంగ విశ్లేషకునిగా నూతన జాతీయ విద్యా విధానం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఏ విధంగా నష్టపోతారనే వ్యాసం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారని కొనియాడారు. గతంలో యూటీఎఫ్ లో శేషగిరితో ఉద్యమ సహచరునిగా కలిసి పని చేసామని,అదేవిధంగా గత రెండున్నర దశాబ్దాలుగా  ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై జరిగిన అనేక ఐక్య పోరాటాల్లో కలిసి పాల్గొన్నామని సామల తన జ్ఞాపకాలను గుర్తు చేసారు. కామ్రేడ్ కోరెడ్ల శేషగిరి  మరణం  తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన మరణం రాష్ట్ర  విద్యారంగానికి, ఉపాధ్యాయ , ఉద్యోగ , కార్మిక ఉద్యమాలకు తీరని లోటని అభివర్ణించారు  ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సామల పేర్కొన్నారు.

గజ గజ లాడిస్తున్న గజ రాజులు

 గజ గజ లాడిస్తున్న గజ రాజులు 

కూరగాయలు కోత కు వెళ్లిన మహిళ మృతి
పొలాల్లో కి వెళ్ళడానికి భయపడుతున్న రైతులు
నేటి కి ఆరుగురు మృతి 
ప్రభుత్వం రెండు కోట్లు కు పైగా నష్టపరిహారం చెల్లింపు
పదుల సంఖ్యలో ఫారెస్ట్ సిబ్బంది కి గాయాలు, వాహనాలు ధ్వంసం
మూడు ఏళ్లుగా ఇదే తంతు దొరకని  శాశ్విత పరిష్కారం

కురుపాం, పెన్ పవర్

కురుపాం నియోజకవర్గంలో లో ఏనుగులు ప్రవేశించి మూడు ఏళ్ళు పైగా అవుతుంది,కానీ నేటికీ శాశ్విత పరిష్కారం దొరకలేదు,గురువారం తెల్లవారుజామున కోమరడా మండలం పాత కల్లికోట గ్రామానికి చెందిన అల్లాడా అప్పమ్మా అనే మహిళ కూరగాయలు కోయడానికి వెళ్ళేరు,ఇమే పై ఒక ఏనుగు దాడి చేయడం తో ఆమె అక్కడ కు అక్కడే మృతి చెందింది, ఇమే మృతి తో మృతుల సంఖ్య ఆరు కు చేరింది,ఒక వైపు కరోనో మరో వైపు ఏనుగుల దాడులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,నాగావళి నది తీరం ఉండటం తో  పుష్కలంగా నీరు,జియ్యమ్మవలస కోమరడా మండలలో అరటి , చెరకు ,లాంటి పంటలు ఉండటం తో వాటికి ఆహారం కూడా ఇబ్బంది లేకుండా ఉండటం తో ఈ ప్రాంతం విడి పోవటం లేదు,గతం లో ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పుడుకు అది కార్యరూపం దాల్చలేదు,ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు,గాయాలు పాల అయిన వారికి,ప్రాణ నష్టం జరిగిన వారికి కలిపి సుమారు రెండు కోట్ల రూపాయలు వరకు నష్ట పరిహారం చెల్లించింది, ఒక వైపు ఫారెస్ట్ అధికారులు కష్టం మరో వైపు ప్రభుత్వం నష్ట పరిహారం రూపం లో చెల్లిస్తున్న కోట్ల రూపాయలు  వృధా అవుతున్నా శాశ్విత పరిష్కారం చుపలేకపోతున్నారు.

కురుపాం, పార్వతీపురం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అధికారులు కు నిరంతరం ఏనుగులు ను ట్రాక్ చేస్తున్న ఎలిఫెంట్ ట్రాకర్ లు కు కూడా చేతిలో బాంబులు పేలి గాయాలు పాల అయ్యారు,ఎవరో చనిపోతే ఆస్తి నష్టం జరిగి రైతులు రోడ్ ఎక్కితేనే ఈ విషయం పై ఒకరోజు చర్చ జరిగి తరవుతా వదిలేయడం కారణంగా ఇన్ని ఏళ్లుగా ఈ సమస్య కు పరిష్కారం కాలేదు,ఇప్పటికి అయిన ఫారెస్ట్ అధికారులు ,నాయకులు,శాశ్విత పరిష్కారం చూపాలని ప్రజలు,రైతులు కోటుతున్నారు.

 మూడు ఏనుగులు మృతి..

మనుషులు ప్రాణాలు, ఆస్తి నష్టం ఎంత ముఖ్యమో ముగ జీవులు ప్రాణాలు కాపాడటం కూడా మనకు అంతే ముఖ్యం,గతం లో ఒక ఏనుగు విద్యుత్ షాక్ తో మరో ఏనుగు నాగావళి నదిలో చిక్కుకొని మృతి ఛేధింది.మూడవ ఏనుగు అనారోగ్యంతో మృతి చెందింది.. దీనితో జంతు ప్రేమికులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు,ముగ జీవులు కు ప్రజలు కు ఇరువులు కు ఇబ్బంది లేని ప్రదేశానికి వాటిని తరలించాలని కోరుతున్నారు.

గన్నెలకోట సర్పంచ్ అనారోగ్యంతో మృతి

గన్నెలకోట సర్పంచ్ అనారోగ్యంతో మృతి

పెదబయలు  పెన్ పవర్

మండలంలోని, గన్నెలకోట పంచాయతీ సర్పంచ్ లకే దేవకుమారి(36)_అనారోగ్యంతో బుధవారం సాయంత్రం చామగడ్డ గ్రామంలో మృతి చెందారు. రెండు రోజులగాా ఆమె అనారోగ్యంతో బాధ పడుతూ ఆమె మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేసారు. మృతురాలు దేవకుమారి గిన్నెెల కోోట సర్పంచ్ గా రెండు దఫాలు ఏక గ్రీవంగా ఎన్నిక య్యారు. వైసిపి పార్టీ ఆవిర్భావం నుంచి ఆమె తన  భర్త చిన్నారావు తో కలిసి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ  పంచాయతీ ప్రజలకు  విశేష సేవలు  అందించారు. ఆమె  మాట అంటే పంచాయతి ప్రజలకు  శిలా సాసనం.




కరోనా తో వార్డు కౌన్సిలర్ మృతి

 కరోనా తో  వార్డు కౌన్సిలర్ మృతి

పెన్ పవర్, కొవ్వూరు

కొవ్వూరు మున్సిపల్ కార్పొరేషన్ 23 వ వార్డు కౌన్సిలర్  మురికొండ రమేష్ కరోనాతో మృతిచెందారు. రమేష్ మృతికి మన గౌరవ మంత్రివర్యులు తానేటి వనిత తన ప్రగాఢ సంతాపం తెలియచేసారు. కొవ్వూరు మున్సిపాలిటీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని  ఏర్పరచుకుని ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ తనదైన శైలిలో సేవ చేస్తూ ఎంతో పేరు తెచ్చుకున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ వార్డు కౌన్సిలర్ మృతికి చైర్మన్ భావనా రత్నకుమారి తో పాటు కౌన్సిలర్లు కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

కరోనా తో పోరాడి ఓడిన మీ సేవ సత్యనారాయణ

 కరోనా తో పోరాడి ఓడిన మీ సేవ సత్యనారాయణ

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 ఆత్రేయపురం గ్రామంలో కరోనా  మహమ్మారి మరణ మృదంగం గంటలు మోగుతున్నాయి  ఒకపక్క కరోనాబారిన పడిన వారు కోరుకుంటుంటే మరోపక్క కరోనా బారిన పడిన  తట్టుకోలేక మృతి చెందుతున్నారు ఈరోజు ఆత్రేయపురం మీసేవ కేంద్రం నిర్వహిస్తున్న కాజులూరు రమా సత్యనారాయణ (42)  కరోనా పాజిటివ్ వచ్చినది ఆయన కొద్ది రోజులుగా రాజమహేంద్రవరం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు  ఆయన మృతి పట్ల ఆత్రేయపురం మండలం మీ సేవ కేంద్రాల నిర్వాహకులు సంతాపం వ్యక్తం చేశారు.

అక్రమంగా మద్యం అమ్మినా, తయారుచేసిన కఠిన చర్యలు

అక్రమంగా మద్యం అమ్మినా, తయారుచేసిన కఠిన చర్యలు

పోలవరం, పెన్ పవర్

పోలవరం ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మరియు తమ సిబ్బంది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏలూరు వారి అదేశాలమేరకు తనిఖీల్లో భాగంగా మంగళవారం ఎర్లీ మార్నింగ్ గోపాలపురం మండలం వెంకటాయపాలెంలో 35 లీటర్ల నాటుసారా పట్టుకోవడం జరిగింది. సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ రైడింగ్ లో భాగంగా ఒక గ్లామర్ బైక్ పట్టుబడినట్లు, మరియు ఒక వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇతను దేవరపల్లి మండలం కృష్ణంపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి గా గుర్తించడం జరిగిందని అన్నారు. మరియు కృష్ణంపాలెం నుండి వెంకటాయపాలెం కు నాటుసారా తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలియజేశారు.

డుంబ్రిగుడ మండల జెడ్పీటీసీ అభ్యర్థి ఆకస్మిక మృతి

 డుంబ్రిగుడ మండల జెడ్పీటీసీ అభ్యర్థి ఆకస్మిక మృతి 

అరకు, పెన్ పవర్

అరకు వేలి నియోజకవర్గం డుంబ్రిగుడ మండలం కాంగ్రెస్ పార్టీ జెడ్.పి.టి.సి,అభ్యర్థి కొర్ర రుక్మిణి గుండెపోటు తో మంగళవారం అకస్మాత్తుగ మృతి చెందారు ఆమె భౌతిక కాయాన్ని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అరకు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పాచిపెంట శాంతకుమారి సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పార్టీ నుండి వారికి ఎటువంటి సాయం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటామని తెలియజేశారు.అరకు వేలి మండలం ప్రెసిడెంట్ సోమెలి సన్యాసిరావు మండల నాయకుడు పాచిపెంట చిన్నస్వామి హుకుంపేట జెడ్పిటిసి అభ్యర్థి,గలుగు బోయిన కోటేశ్వరరావు, డుంబ్రిగుడ మండల కార్యదర్శి బిమరావు,కె హరిష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఆమెతో ఉన్నారు.

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ ని అరికట్టండి

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ ని అరికట్టండి

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరం నగరంలో కోవిడ్ వ్యాధి అత్యవసర పరిస్థితిని ఆసరా చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంటున్నాయని సి.పి.ఎం జిల్లా కమిటీ విమర్శించింది. ఈ మేరకు సి.పి.ఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ ఒక ప్రకటన ద్వారా జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీని అరికట్టాలని కోరారు.ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాకుండా లక్షల్లో దండుకుంటున్నారని, పైగా రెమిడేసిఫర్ ఇంజెక్షన్ రోగులు తెచ్చుకోవాలని తమకు సంబంధం లేదని తిప్పడం ఆ తరువాత బ్లాక్ లో లక్షలు గుంజటం ప్రైవేట్ ఆస్పత్రుల వ్యాపారంగా మారిందని మండిపడ్డారు.ప్రజలను ఆదుకోవాల్సిన ప్రైవేట్ వైద్యరంగం ఇలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి ని సొమ్ము చేసుకోవడం దుర్మార్గమని నగరంలో ఉన్న ప్రజా ప్రతినిధులు,అన్ని రాజకీయ పార్టీల నాయకులు దీనిపై స్పందించాలని అరుణ్ కోరారు.అఖిల పక్ష పార్టీలు,సంస్థల సమావేశం జరిపి ఈ పరిస్థితి ని అధిగమించడానికి చర్యలు చేపట్టాలని కోరారు.

కరోనాతో ఇరిగేషన్ ఏ ఈ జగన్నాథ మృతి

 కరోనాతో ఇరిగేషన్ ఏ ఈ జగన్నాథ మృతి

మెంటాడ, పెన్ పవర్  

మెంటాడ మండలం, ఆండ్ర రిజర్వాయర్ పరిధిలోని ఇరిగేషన్ ఏ ఈ గా విధులు నిర్వహిస్తున్న టి. జగన్నాథం ఈ తెల్లవారుజామున కరోనాతో మృతి చెందినట్లు ఇరిగేషన్ డీఈ పాండు తెలిపారు. ప్రస్తుతము ఆయన దత్తిరాజేరు మండలం ఇరిగేషన్   ఏ ఈ గా విధులు నిర్వహిస్తున్నారని డి ఈ పాండు తెలిపారు. జగన్నాథం మృతి ఆయన కుటుంబానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధ తిరిగేసి అధికారులంతా సంతాపం తెలిపారు. వృత్తినే దైవంగా భావించి అనుదినం ఆయన విధులు నిర్వహించే వారిని అటువంటి వ్యక్తి చనిపోవడం బాధాకరమని పలువురు మండల స్థాయి అధికారులు, గజపతినగరం సబ్ డివిజన్ ఇరిగేషన్ అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.

సువ్వాడ మరణం తీరని లోటు

సువ్వాడ మరణం తీరని లోటు


మెంటాడ, పెన్ పవర్ 

సాలూరు మండలం వైసీపీ కన్వీనర్ దువ్వాడ రమణ అకాల మరణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి, ఆయన కుటుంబ సభ్యులకు తీరనిలోటని సాలూరు ఎమ్మెల్యే పీడి క రాజన్న దొర అన్నారు.  చివరి చూపులు చూడలేకపోయానని ఎమ్మెల్యే రాజన్నదొర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో    సహనం, ఓపిక,సత్త సహకారం అనే నాలుగు నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు సువ్వాడ.రమణ  అని రాజన్నదొర కొనియాడారు.  2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సాలూరు మండలంలోని సువ్వాడ. రమణ నాయకత్వంలో వైస్సార్సీపీ బ్రహ్మాండమైన మెజారిటీ రావడానికి రమణ  కృషి చేశారని రాజన్న దొర గుర్తు చేసుకున్నారు.  పెద్ద వయస్సు అయినందున,వేసవికాలం అయినందున గడపగడపకు కార్యక్రమం, పాదయాత్ర కార్యక్రమంనకు రావొద్దున్నా ఎమ్మెల్యే రాజన్నదొర గారి కంటే ముందే ఉండేవారు. 2018 సంవత్సరం జనవరి నెలలో ఎమ్మెల్యే గారు కొఠియా నడిచి రావద్దు అని చెప్పినా ఎమ్మెల్యే రాజన్నదొర గారితో,మాజీ జడ్పీటిసి రెడ్డి.పద్మావతి గారితో మరియు ఇతర వైసీపీ నాయకులతో పోటీగా ఏజెన్సీ ప్రాంతంలో నడిచారు. బహుశా సాలూరు మండలంలోని ఎమ్మెల్యే రాజన్నదొర గారి వెంట లేకుండా ఎమ్మెల్యే గారి ఏ కార్యక్రమమైనా సరే అది రాజకీయమైన,వివాహామైన, చావైన,పండగైనా,పలకరింపైనా సరే నాకు తెలిసి వెళ్లలేదేమో. సాలూరు మండలంలోని మామిడిపల్లిలో చివరగా ఎమ్మెల్యే రాజన్నదొర గారు ప్రచారం చేసిన ఎంపీటీసీ ఎన్నిక కూడా సువ్వాడ.రమణ గారిదే.  నునిత్యం ఎమ్మెల్యే రాజన్నదొర గారి వెంట ఉండి ఇప్పుడు రాజన్నదొర గారికి,ఆయన కుటుంబానికి, వైస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు కనిపించకుండా, అగుపించకుండా హఠాత్తుగా మాయమై అందనంత దూరానికి వెళ్లిపోయారని, సువ్వాడ రమణ గారిని చివరి సారిగా చూసే అవకాశం కూడా కలుగలేదు అని ఈ బాధను ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని సువ్వాడ.రమణ గారి జ్ఞాపకాలు,సేవలు స్మరిస్తూ ఆయన నాయకత్వం,అంకిత భావం ఎల్లవేళలా మాతో ఉంటాయని ఆయన స్పూర్తితో నేను,మా నాయకులు మరియు కార్యకర్తలు ముందుకు నడుస్తాం అని  ఎమ్మెల్యే రాజన్నదొరగారు  దిగ్బ్ర్హాంతి వ్యక్తం చేశారు.                                                                                                            

సెల్కాన్ కంపెనీ ప్రమాదం లో కార్మికుని మృతి

 సెల్కాన్ కంపెనీ  ప్రమాదం లో కార్మికుని మృతి

పరవాడ, పెన్ పవర్ 

ఫార్మా సిటీలో సెల్కాన్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఆదివారం రాత్రి బాయిలర్ వద్ద బొగ్గు పనులు నిర్వహిస్తుండగా  గోడకూలి బాయిలర్ ఆపరేటర్ అక్కడికక్కడే మృతి చెందారు అని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ తెలియ జేశారు. మృతదేహాన్ని యాజమాన్యం విశాఖ కేజీహెచ్ తరలించింది అన్నారు. 

ఈ ప్రమాదంలో మృతిచెందిన   జి.తులసిరావు వయసు 32 తూర్పుగోదావరి జిల్లాకి చెందిన వ్యకి కుటుంభ పోషణార్ధం ఫార్మాసిటీ లోని సెల్కాన్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో బ్రాయిలర్ అపరేటర్ గా పనిచేస్తున్నాడు అని అన్నారు. కుటుంబానికి ఇతడే ఆధారం అని తులసిరావు మృతితో ఆ కుటుంభం ఎంతో నష్టపోయింది అని గనిశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి నష్ట పరిహారం ఉద్యోగం కల్పించాలని భద్రతా ప్రమాణాలు అమలు చెయ్యని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు.  సోమవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు ప్రభుత్వం ఇప్పటికైనా మెల్కోని భద్రతా ప్రమాణాలు అమలు చేయని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


బొలేరో వాహనం ఢీ కొనడంతో వ్యవసాయ కూలీలు ఇద్దరు మృతి

 బొలేరో వాహనం ఢీ కొనడంతో వ్యవసాయ కూలీలు ఇద్దరు మృతి

 సీతానగరం, పెన్ పవర్ 

 సీతానగరం మండలం వంగలపూడి గ్రామానికి చెందిన దారా కాంతారావు,కొండేపూడి.నాగరాజు అను వారు పని నిమిత్తం కాలినడకన వెళ్లుచుండగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ప్రగడపల్లి గ్రామ సమీపంలో మితిమీరిన వేగంతో బొలేరో ఢీ కొనడంతో కాంతారావు,నాగరాజు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పంచనామా జరిపి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లుగా తెలియజేశారు.

50 లీటర్ల నాటుసారా పట్టివేత

50 లీటర్ల నాటుసారా పట్టివేత

తాళ్లపూడి, పెన్ పవర్

ఎస్ఈబి ఏలూరు వారి అదేశాలమేరకు పోలవరం ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మరియు సిబ్బంది తనిఖీల్లో భాగంగా తాళ్లపూడి మండలం పెద్దేవం మరియు బల్లిపాడు గ్రామాల్లో శనివారం ఉదయం 50 లీటర్ల నాటుసారా పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు, రెండు మోటారు సైకిళ్లు పట్టుబడినట్లు, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు. సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఎవరైనా అక్రమ మద్యం అమ్మినా, తయారు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

అట్రాసిటీ కేసుపై సెల్-వన్ డిఎస్పీ విచారణ...

అట్రాసిటీ కేసుపై సెల్-వన్ డిఎస్పీ విచారణ...

 సామర్లకోట, పెన్ పవర్ :      

సామర్లకోట పోలీసు స్టేషన్లో మూడు రోజుల క్రితం నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై కాకినాడ ఎస్సీ, ఎస్టీ సెల్-వన్ డిఎస్బీ అప్పారావు శనివారం ప్రత్యేక విచారణ జరిపారు. స్థానిక ఉప్పువారి వీదికి చెందిన వాలంటీరుకు, వారి వర్గీయులకు, ఉప్పువారి వీదికి చెందిన యువకులకు ఈ నెల 28వ తేదీన ఘర్షణ జరగగా పలువురు యువకులు గాయాల పాలవగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకులు ఒసీ సామాజిక వర్గానికి చెందిన యువకులపై వాలంటీరు విధుల్లో ఉన్న తనను కులం పేరుతో దూషించడమే కాకుండా ఈ విషయంపై సామరస్యంగా సమస్య పరిష్కరించుకునేందుకు వెళ్ళిన తమ నాయకులపై అవతలి వర్గం దాడికి దిగి కులం పేరుతో దూషిస్తూ గాయాల పాలు చేసారంటూ స్థానిక పోలీసు స్టేషన్లో అట్రాసిటీ ఫిర్యాదు చేసారు. ఆ వివాదంలో 11 మందిపై కేసులు నమోదయ్యాయి. దానికి సంబందించి శనివారం ఉదయం కాకినాడ ఎస్సీ, ఎస్టీ సెల్-1 డిఎస్పీ  అప్పారావు విచ్చేసి సంఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. ఉదయం నుంచి మధ్యహ్నం వరకు ఫిర్యాదు దారుల వర్గానికి సంబంధించిన 11 మందిని డిఎస్పీ విచారించి వారి వాంగ్మూలాలను రికార్డు చేసారు. కాగా విచారణ ప్రస్తుతానికి ఒక వర్గానికి సంబందించి మాత్రమే పూర్తయిందని, మరలా రెండో వర్గం నుంచి విచారణ నిర్వహించనున్నట్టు డిఎస్పీ చెప్పారు.  తదుపరి చర్యల నిమిత్తం ముందుకెళ్ళనున్నట్టు ఆయన చెప్పారు. అయితే ఈ విచారణను స్థానిక విఆర్వో సత్యన్నారాయణ సమక్షంలో చేపట్టగా స్థానిక ఎస్ ఐ సుమంత్, స్టేషన్ సిబ్బంది విచారణలో పాల్గొన్నారు.


గౌరవరంలో 2600 లీటర్ల బెల్లం పులుపు ద్వంసం

గౌరవరంలో 2600 లీటర్ల బెల్లం పులుపు ద్వంసం

వి.మాడుగుల, పెన్ పవర్

మండలం లోని గవరవరం పరిధిలో శనివారం స్పెషల్ ఎన్ పోర్స్ మెంట్ బ్యూరో దాడులు  నిర్వహించారు. మాడుగుల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో  బత్తుల జగదీశ్వరరావు అందించిన సమాచారం మేరకు ఉదయం గవరవరం ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా నాటు సారా తయారు చేసినందుకు ఉపయోగించే బెల్లం పులుపుని ధ్వంసం చేశారు. రెండు వేల ఆరు వందలు లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం చేసి నాటు సారా బట్టీలు కొల్లగొట్టారు. సారా తయారీ దారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాటు సారా తయారీ అమ్మకాలు చేపడితే   కఠిన చర్యలు తీసుకుంటామని  జగదీశ్వరరావు హెచ్చరించారు.

కరోనతో వృద్దురాలు మృతి

 కరోనతో వృద్దురాలు మృతి

పెద్దగూడూరు,  పెన్ పవర్ 

మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లక్ష్మీపురం (గుండ్రపల్లి) గ్రామానికి చెందిన పులుసం గాదెమ్మ(70)సం"లు కరోనాతో మృతి చెందింది. పులుసం గాదెమ్మ గత నాలుగురోజుల నుండి తీవ్రమైన జ్వరం రావడంతో స్థానిక ఆశా వర్కర్ కొత్తగూడ మండల కేంద్రంలో పి హెచ్ సిలో పరిీక్షలు నిమిత్తం వారి కుటుంబాన్ని తీసుకొని ముగ్గురికి కరోన పాసిటివ్ నిర్దారణ అయ్యింది.వైద్యులుమందులు ఇచ్చి హోం క్వారంటైన్ కి పంపించగా మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు.

మౌలాలి లో విద్యుత్ షాక్ కి గురైన మరో బాలుడు

 మౌలాలి లో విద్యుత్ షాక్ కి గురైన మరో బాలుడు

ఈస్ట్ మారుతి నగర్ లోని ఘటన మరవక ముందే ఎం.జె కాలనిలో మరో ఘటన

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్న స్థానికులు

మరో 48 గంటలు గడిస్తేగాని చెప్పలేం అంటున్నా వైద్యులు



పెన్ పవర్, మల్కాజిగిరి

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఎం జె కాలనీ లో విద్యుత్ షాక్ కి గురైన నైనిష్ 5సం బాలుడు, ప్రక్కనే ఉన్న మరో అపార్టమెంట్ లో అడుకుంటున్నా సమయంలో అకస్మత్తుగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పేలిపోవడంతో అక్కడే ఉన్న బాలుడుకి తీవ్ర గాయల పాలైయ్యారు. చికిత్స కోసం సైనిక్ పూరిలోని అంకురా హస్పిటల్ కు తరలించారు. నైనిష్ బాలుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని 48గంటలు సమయం గడిస్తేకానీ ఏవిషయం చెప్పలేం అన్ని వైద్యులు తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద సారియైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాడంలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వ్యహిస్తున్నారని, ఈస్ట్ మారుతినగర్ లో ఘటన మరవక ముందే ఎం.జె.కాలనీ లో మరో ఘటన జరిగిన విద్యుత్ అధికారులు పై ఎటువంటి చర్యలు తీసుకొకపోవడంతో స్థానికులు ఆగ్రహ వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బాలుడు తండ్రి మాట్లాడుతూ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద సారియైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలంటు పల్లుమర్లు విద్యుత్ అధికారులకు పీర్యాదు చేసిన వారు స్పందించకుండా నిర్లక్ష్యం వ్యహించడంతో ఈ రోజు విద్యుత్ ప్రమాదంలో బాలుడుకి షాక్ కి గురై అసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో కొటుమిట్టాడుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ కరణంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకుంటున్నమని దయచేసి మా బాలుడు నైనిష్ కు వైద్య కర్చులకు ఆర్ధిక సహయం చేయాలంటు వేడుకుంటున్నారు. దాతలు ముందుకు వచ్చి 9542974268 బాలుడు ప్రాణాలు కాపాడలని ఆ కుటుంబ సభ్యులు కొరుతున్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...