Followers

Showing posts with label ANDHRA PRADESH. Show all posts
Showing posts with label ANDHRA PRADESH. Show all posts

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

 

అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు


శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు


పట్టించుకోని పలు విభాగాల పోలీసులు


పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు


యువకుల నుంచి బడా వ్యాపారులవరకు బెట్టింగ్


గ్రామీణ ప్రాంతాలకు పాకిన బెట్టింగులు 



పీసీపల్లి పెన్ పవర్ ఏప్రిల్ 1


ఐపీఎల్ సీజన్ కొందరి జీవితాల్లో వెలుగు నింపుతుండగా మెజార్టీ వారి జీవితాలు బుగ్గిపాలు చేస్తోంది. బెట్టింగ్ కు పాల్పడుతూ లక్షలరూపాయలు నష్టపోతున్నారు.. తమతమ ఆర్థిక స్థోమతను బట్టి బెట్టింగ్ కు పాల్పడుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ వంటి  నగరాల్లో పరిమితమైన బెట్టింగ్ నేడు గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం కాగానే బెట్టింగ్ జోరు కొనసాగుతోంది.  ప్రతిరోజూ బెట్టింగ్లు జరుగుతున్నాయి. లక్షలాది రూపాయలు చేతులు మరుతున్నాయి. పోలీసులు నిఘా పెట్టినా అడ్డాలను మార్చుతూ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం. ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం గ్రామీణ  ప్రాంతాలకు కూడా పాకింది.. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే - పరిమితంగా ఉండే బెట్టింగ్ వ్యవహారం నేడు గ్రామీణ ప్రాంతాల్లో యువకులు కూడా బెట్టింగ్లకు పాల్పడుతున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.. 

 వేసవిలో వస్తున్న  ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లపై ప్రతిరోజు లక్షల్లో బెట్టింగులు నడుస్తున్నాయి. ప్రధానంగా క్రికెట్ అభమానులు. యువత బెట్టింగ్ లో పాల్గొనేందుకు ఆసక్తిని చూపుతుంటారు. ఇందుకోసం ఒక గ్రూపుగా ఏర్పడి లక్షల్లో బెట్టింగ్ లు చేస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేక గదుల్లో టీవీలతో సెటప్ చేసుకుని, బెట్టింగ్లు నిర్వహిస్తుంటారు. తమ మొబైల్ ఫోన్లలో ఐపీఎల్ మ్యాచ్లను లైవ్లో చూస్తూ అప్పటికప్పుడు తమ స్నేహితులతో కలిసి బెట్టింగ్ లలో లక్షలు పెడుతుంటారు. బెట్టింగ్ ల దందాను అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు పెద్దగా నిఘా పెట్టడం లేదు.. బెట్టింగ్ ముఠాలు ప్రతిరోజు పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తూ.సొమ్ము చేసుకుంటున్నాయి. దీంతో కొంతమంది బెట్టింగ్ లలో నష్టపోతున్నారు.  యూత్ నుంచి మొదలు బడా వ్యక్తుల వరకు అందరూ బెట్టింగ్ లో పాల్గొంటూ, లక్షలు పొగొట్టుకుంటున్నారు. చాలా మంది  ఇతర ప్రాంతాల్లో ఉంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. పోలీసులకు ఏమాత్రం దొరకకుండా, గుట్టుచప్పుడు కాకుండా అంతా కోడ్ పద్దతిలో బెట్టింగ్ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు. పోలీసులు ఈసారి ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్ లపై సరైన నిఘా పెట్టకపోవడంతో, మరింత యథచ్చేగా బెట్టింగ్ దందాను సాగిస్తున్నారు.


అంతా కోడ్ బాష లోనే

బెట్టింగ్ లో పాల్గొనే వారికి నిర్వహకులు అంతా కోడ్ భాషలోనే లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఏమాత్రం పోలీసులకు అనుమానం రాకుండా, తెలిసిన వారిని మాత్రమే బెట్టింగ్ లోకి తీసుకుంటారు. కొత్తవారిని ఏమాత్రం తీసుకోరు.


అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు

 గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దందాలు పందెంలో గెలిచినా ఓడినా సరే డబ్బు కూడా ఆన్లైన్లోనే బదిలీ అవుతోంది. ముఖ్యంగా ఆన్లైన్ సర్వీస్లు అయిన గూగుల్పే, పేటీఎం, ఫోన్ పే యాప్ల నుంచి నగదును ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ వ్యవహారం జరుగుతుండడంతో ఎక్కడ ఏ చిన్న అనుమానం రాకుండా గుట్టుగా వ్యవహారం కొనసాగుతోంది.


బెట్టింగ్లో దొరికితే చిక్కులే.


బెట్టింగ్ మాయలో పడితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. పోలీసులు ఎఫ్ఎఆర్ నమోదు చేస్తారు. పోలీసులరికార్డుల్లో పేరు, చిరునామా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా, విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు తప్పవు. బెట్టింగ్ఆడుతూ లేదా నిర్వహిస్తూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవు. యువత సన్మార్గంలో నడవాలి. ఈజీ మనీకి అలవాటు పడి చెడు మార్గాన్ని ఎంచుకోవద్దు. ప్రభుత్వం ఉద్యోగాలకునోటిఫికేషన్ ఫికేషన్ వేస్తోంది ఉంది. ఉద్యోగా ఉద్యోగాలు సాధించేలా చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా ఉద్యోగాలు సంపాదించాలి. ఇలాంటి వ్యవహారాల్లో తల దూర్చకూడదు. 



రోజురోజుకు విస్తరిస్తున్న బెట్టింగ్


ఐపీఎల్ పేరిట బెట్టింగ్ దందా చాపకింద నీరులా వ్యాపి స్తోంది. బెట్టింగ్ కు చిన్నా పెద్దా అనే తేడా లేదు. మరీ ముఖ్యంగా యువత బెట్టింగ్ కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నది. కొందరు ఈజీ మనీకి అలవాటు పడి సర్వం కోల్పోతున్నారు. క్రికెట్ ప్రేమికుల వ్యసనాన్ని, బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ చివరికి తమను తామే కాపాడుకోలేనంత ఉచ్చులోకి వెళ్లిపోతున్నారు.. అప్పులు ఇచ్చిన వ్యక్తులు వేధిస్తున్న క్రమంలో డిప్రెషనకు లోనవుతున్నారు. అప్పుల బాధ భరించలేక ఆస్తులు అమ్ముకున్న వారు కొందరుంటే ఆత్మహత్యలకు పాల్పడి జీవితాలను, కుటుంబాలను ఛిద్రం చేసుకుంటున్న వారు పోలేదు. అయితే గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్ లో సాగిపోతున్న ఈ నయా జూదానికి పోలీసులు సైతం ముక్కుతాడు వేయలేకపోతున్నారు.రికార్డు స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నాయి.. పోలీసులు నిఘా పెట్టినా అడ్డాలను మార్చుతూ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది.. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితంగాఉండే బెట్టింగ్ వ్యవహారం నేడు గ్రామీణ ప్రాంతాల్లో యువకులు కూడా బెట్టింగ్లకు పాల్పడుతున్నారంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు.. ముఖ్యంగా యువత బెట్టింగ్ జాడ్యాలకు తమ నిండు నూరేళ్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా బెట్టింగ్లకు పాల్పడటం అప్పులు కావడం వాటిని తీర్చేందుకు నానాతంటాలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం.

ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం.

నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్.

 ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైకిళ్ళు

 ప్రభుత్వ ఖజానాకు లక్షలాది రూపాయలు  నష్టం.

పెన్ పవర్ బ్యూరో, విశాఖపట్నం

ఒకే పార్టీ నాయకుల మధ్య తలెత్తిన వర్గపోరు ప్రభుత్వ లక్ష్యాన్ని సైతం నీరుగార్చింది. పేద వికలాంగులకు ఉపయోగపడే మూడు చక్రాల సైకిలు అందించాలని ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి వీల్చైర్ లను సమకూరిస్తే ఆదిపత్య పోరుతో  అవి కాస్త పంపిణీకి నోచుకోలేదు. పది నెలలుగా ఎండలో ఎండి వానలో తడవడం వల్ల మూడు చక్రాల సైకిళ్ళు తుప్పు పట్టి పోయాయి. వాటిని వికలాంగులకు అందించిన వాటిని స్క్రాప్ కింద  కిలోల లెక్కన అమ్ముకోవాల్సిందే.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్ళు ను  2020 ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా  మండల పరిషత్ కార్యాలయాలకు చేరాయి. అధికారులు వాటిని స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదగా పంపిణీ జరగాల్సి ఉంది. కానీ జిల్లాలో పాయకరావుపేట  నియోజకవర్గం  ఎస్ రాయవరం మండలం లో వికలాంగులు సైకిళ్ళు   పంపిణీ జరగలేదు. ప్రభుత్వం ఉచితంగా మూడు చక్రాల సైకిలు  ఇస్తుందని  వికలాంగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పది నెలలు అవుతున్న వీల్చైర్ ల పంపిణీ కి  నోచుకోలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే  అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీపీల మధ్య తలెత్తినా వర్గ వివాదం  సంక్షేమ పథకాలను మూలకు చేరుతున్నాయి. మండలంలో గుర్తించిన వికలాంగులకు అవసరమైన  80  వికలాంగు సైకిళ్లను ఆగస్టులో పరికరాలు తెచ్చి బిగించారు. నేతల మధ్య పోరు మూడు చక్రాల సైకిల్ పంపిణీకి గ్రహణం పట్టింది.

వాటిని పంపిణీ చేయడానికి  స్థానిక ఎంపిడిఓ  చొరవ చూపకపోవడంతో  మూడు చక్రాల సైకిలు మూలకు చేరాయి. వాటిని మండల కేంద్రంలో రెల్లి వీధి ఆర్ బి కె   వద్ద పడేశారు. ఆగస్టు తర్వాత కురిసిన వర్షాలు  ఆతర్వాత ఎండలకు వికలాంగులు సైకిల్ లు పూర్తిగా పాడైపోయాయి. వాటిని చూస్తే  కాలం చెల్లిన మూడు చక్రాల సైకిలు  అనుకోక తప్పదు. తుప్పు పట్టి పోయి సీట్లు  కూలిపోయి గుట్టలుగా పడి ఉన్న స్క్రాప్ ల  దర్శనమిస్తుంది. వికలాంగుల కోసం  ప్రభుత్వం లక్షలు వెచ్చిస్తే  ఇరువురు నేతల వర్గ పోరు తో  అవి కాస్త బూడిదలో పోసిన పన్నీరు అయింది. వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి  సంక్షేమ పథకాలు పేదలకు చేరుతున్నాయి అని ఆశిస్తున్నారు. కానీ అక్కడ అక్కడ పార్టీ నాయకుల్లో  తలెత్తిన అవాంతరాల కారణంగా  పధకాలు పేదలకు చేరడం లేదన్న నగ్నసత్యం  పెరుమాళ్ళకెరుక. మూడు చక్రాల సైకిల్ నష్టాన్ని ఎవరు పూడుస్తారు. ఈ నాయకులా? లేక సంబంధిత అధికారులా?..

జాతీయ రహదారుల భూసేకరణపై సమీక్ష

జాతీయ రహదారుల భూసేకరణపై సమీక్ష

 అభివృద్ధిలో పచ్చదనానికి ప్రాధాన్యత 

రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్

విజయనగరం, పెన్ పవర్

అభివృద్ధి కార్యక్రమాల్లో పచ్చదనానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ స్పష్టం చేశారు. జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటాలని ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం, భూ సేకరణ, ఇతర అంశాలపై శుక్రవారం తన చాంబర్లో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విశాఖపట్నం-రాయపూర్ జాతీయ రహదారి, విజయనగరం బైపాస్ రోడ్డు, సాలూరు బైపాస్, మానాపురం ఆర్వోబి, పంచాయితీరాజ్ శాఖ పరిధిలోని 12 రోడ్ల నిర్మాణం, వాటి ప్రస్తుత స్థితి పై ఆరాతీశారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ,  రహదారుల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారి నిర్మాణంలో మొక్కలు వేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని ఆదేశించారు.  విజయనగరం బైపాస్ రోడ్డులో మొక్కలు నాటే పనులను వెంటనే ప్రారంభించలన్నారు. ఈ నెలాఖరు నాటికి డివైడర్ లో మట్టిని నింపి, ఇరువైపులా మొక్కలను నాటేందుకు గోతులు సిద్ధం చేయాలన్నారు. జూన్1 నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. రోడ్ల నిర్మాణం వల్ల ట్రాఫిక్ ఎక్కువై, కాలుష్యం పెరుగుతుందని చెప్పారు. దీనిని అరికట్టాలంటే  మొక్కలను నాటడమే ఏకైక మార్గమన్నారు. అందువల్ల ఒకవైపు రహదారిని పూర్తి చేస్తూనే, మరోవైపు మొక్కలు నాటడం మొదలు పెట్టాలని సూచించారు. రోడ్డు పూర్తి అయ్యేటప్పటికి, మొక్కలుకుడా బాగా పెరుగుతాయని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్డీసి హెచ్వి జయరాం, ట్రాన్స్ కో  ఎస్ఈ వై.విష్ణు, ఆర్అండ్బి ఎస్ఈ విజయశ్రీ, పిఆర్ ఎస్సీ గుప్త,. ఉద్యానశాఖ డిడి శ్రీనివాస్, నేషనల్ హైవేస్ ఏఇ ఈ సురేష్ కుమార్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

గుమ్మలక్ష్మీపురం లో సంపూర్ణ లాక్డౌన్ కి శ్రీకారం

 గుమ్మలక్ష్మీపురం లో సంపూర్ణ లాక్డౌన్ కి శ్రీకారం


లాక్డౌన్ కి మద్దతు ఇచ్చిన వర్తకులకు కృతజ్ఞతలు

కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు సహకరించాలి

సర్పంచ్ బొత్తాడ. గౌరీశంకర్రావు

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

గుమ్మలక్ష్మీపురం పంచాయతీలో శని,ఆదివారాలు సంపూర్ణ లాక్డౌన్ కి శ్రీకారం పడింది. కోవిడ్ వ్యాప్తి రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ విధించింది.మధ్యాన్నం 12 నుండి ఉదయం 6గంటల వరకు పోలీసులు సహకారంతో ప్రభుత్వం కర్ఫ్యూ నిర్వహిస్తుంది. అయినప్పటికీ పంచాయతీ పరిధిలో కరోనా కేసులు రోజు రోజుకు అధికమవుతున్న తరుణంలో గ్రామ సర్పంచ్ గౌరీశంకర్రావు పిలుపు మేరకు వ్యాపార వర్గాలు శని,ఆదివారాలు సంపూర్ణ లాక్డౌన్ చేయడానికి స్వచ్చంధంగా ముందుకు వచ్చాయి. కరోనా వ్యాప్తిని అరికట్టాలనే మంచి ఉద్దేశంతో వ్యాపార సముదాయాలను మూసివేయడానికి ముందుకు వచ్చిన వర్తకులకు సర్పంచ్ గౌరీశంకర్రావు కృతజ్ఞతలు తెలియచేసారు.

గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు.

గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు.

సంతబొమ్మాలి, పెన్ పవర్

మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అధికారులు కరోనా నివారణ చర్యలు చేపట్టారు. మర్రిపాడు పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు అట్టాడ రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, యువకులు, వీధుల్లో , మురికి కాలువలలో బ్లీచింగ్ వెదజల్లారు. పరిసరాల పరిశుభ్రత తో ఎన్నో వ్యాధులను అరికట్టవచ్చునని ప్రజలకు అవగాహన కల్పించారు. సంతబొమ్మాలి లో  సర్పంచ్ కళింగపట్నం లక్ష్మి ప్రతినిధి కళింగపట్నం అప్పారావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు.వీరితో పాటుగా అంగన్వాడి ఆశా కార్యకర్తలు మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే దండుగోపాలపురం పంచాయతీలో సర్పంచ్ మార్పు అశోక చక్రవర్తి, పంచాయతీ కార్యదర్శులు పీ రామకృష్ణ , సిద్ధార్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది అన్ని వీధుల్లోను బ్లీచింగ్ పౌడర్ చల్లారు. కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ మార్పు నాగభూషణ్,  గ్రామస్తులు పాల్గొన్నారు.

మే 15 తర్వాత మొదటి డోస్ టీకా

 మే 15 తర్వాత మొదటి డోస్ టీకా 

మెంటాడ, పెన్ పవర్ 

మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శృతి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మే 15  తేదీ వరకు మొదటి డోస్ టీకా ను నిలిపివేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే మొదటి డోసు టీకా వేసుకున్న వారు చాలామంది ఉన్నారని వారికి  మే 15వ తేదీ లోపు రెండో డోసు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రస్తుతము మొదటి డోస్ టీకా ను నిలిపివేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.  కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రెండవ డోసు పూర్తి చేసిన తరువాత మే15 తరువాత మరల మొదటి డోసు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపడతామని ఆమె తెలిపారు.ఈవిషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రస్తుతము మొదటి డోసు టీకా  వేసుకున్న వారిని గుర్తిస్తున్నాం అని అన్నారు. వారికి పూర్తి కాగానే మొదటి డోసు టీకా మళ్లీ వేస్తామని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ వి పద్మలత, సూపర్వైజర్  వెంకటాద్రి, హెల్త్ అసిస్టెంట్ రవి, ఏఎన్ఎంలు జయశీల, లతా, పార్వతి, ఆశా కార్యకర్తలు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అర్హులైన అందరికీ వ్యాక్సిన్.

 అర్హులైన అందరికీ వ్యాక్సిన్.

సంతబొమ్మాళి, పెన్ పవర్. 

కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు దాటిన అర్హులందరికీ కరోనా మొదటి మరియు రెండో డోస్ వ్యాక్సిన్ వేస్తున్నామని సంతబొమ్మాళి మండలం నౌపడ ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ కోదండ రావు తెలియజేశారు. గురువారం 176 మందికి మరియు  శుక్రవారం 69 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. గురువారం మొదటి డోస్ వేయించుకోవడానికి వచ్చిన వై ఎస్ ఆర్ సి పి జెడ్పిటిసి అభ్యర్థి పాల వసంత రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి, తీవ్రత చాలా ఎక్కువగా ఉందని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం రెండో విడత కరోనా వ్యాక్సిన్ ను ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన విలేఖర్ల బృందానికి వేశారు. ఈ సందర్భంగా వైద్యులు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 1800 వ్యాక్సిన్ కేంద్రానికి రాగా వచ్చిన వ్యాక్సిన్ పూర్తిగా వెయడం జరిగిందని ఆయన తెలిపారు. ఫీవర్ సర్వే విస్తృతస్థాయిలో డోర్ టు డోర్ చేయిస్తున్నామని  ఇప్పటి వరకు జరిగిన కరోనా టెస్టుల్లో 51 మంది హాంఐసోలేషన్ లో ఉండగా 36 మంది పూర్తిగా కోలుకున్నారని తెలుపుతూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల ప్రజలు భయపడకుండా ముందుకు వస్తున్నారని వచ్చిన వారికి రిజిస్ట్రేషన్ పూర్తిచేసి వ్యాక్సినేషన్ వేస్తున్నామని  ఆరోగ్య కేంద్రం పరిధిలో వ్యాక్సినేషన్ కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం పంపిన వరకు టీకా వేస్తున్నామని, పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేటట్లు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి శానిటేషన్ వినియోగిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ఇంటి వద్ద ఉండి భద్రతా చర్యలు చేపట్టినట్లు అయితే కరోనాను  పూర్తిగా జయించొచ్చు అని, బలమైన ఆహారం తీసుకొని, అవసరం ఉన్నంత వరకు విశ్రాంతి తీసుకుంటూ, పలు ఆరోగ్య సూత్రాలను పాటించటం వలన కరోనా దరిచేరదని ప్రజలు భయపడవద్దని ఆయన తెలిపారు.

గొడ్డిపుట్టు ఉపాధి కూలీలకు మాస్క్ లు పంచిన వి.ఆర్పీ

 గొడ్డిపుట్టు ఉపాధి కూలీలకు మాస్క్ లు పంచిన వి.ఆర్పీ

ముంచంగిపుట్టు ,పెన్ పవర్

కరోనా  బారిన పడకుండా ఉపాధి కూలీలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని  భౌతిక దూరం పాటించాలని  ఎన్ఆర్ఈజీఎస్  వి ఆర్ పి వెంగడ  చంద్ర  అన్నారు.శుక్రవారం సుజన కోట పంచాయితీ గొడ్డి పుట్టు గ్రామంలో ఉపాధి కూలీలకు మాస్క్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రెండవ దశ కరోనా విలయ తాండవం ఆడుతుందని  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. మొదటి విడత కరోనా మాదిరి నిర్లక్ష్యం చేయవద్దని  ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. ఉపాధి కూలీలు పనులు చేసే సమయంలో  మాస్కులు  ధరించాలి అని  గుంపులు గుంపులుగా  ఉండకుండా  భౌతిక దూరం పాటించక తప్పదు అన్నారు. పనులు పూర్తి అయ్యాక కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలన్మారు. గ్రామం విడిచి వెళ్లవద్దని ఇల్ల కే పరిమితం కావాలని అన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుని ఎటువంటి అనారోగ్యం వచ్చినా ఆశ కార్యకర్త ఏఎన్ఎం లను సంప్రదించాలని సూచించారు. నిత్యం ఉపాధి పనులు చేసే కూలీలు  మాస్కులు భౌతిక దూరం  తప్పనిసరిగా ఆచరించాలని వీ ఆర్ పి చంద్ర కోరారు. అతని వెంట టి ఏ కూడా పాల్గొన్నారు.

కె.జి.హెచ్ కోవిడ్ ప్రత్యేక అధికారిగా ఐటిడిఏ పిఓ నియామకం రద్దు చేయాలి.

కె.జి.హెచ్ కోవిడ్ ప్రత్యేక అధికారిగా ఐటిడిఏ పిఓ నియామకం రద్దు చేయాలి.

చింతపల్లి, ముంచింగ్ పుట్ లో కోవిడ్ సెంటర్ ప్రారంభించాలి

గిరిజన సంఘం డిమాండ్‌

పెన్ పవర్ బ్యూరో, విశాఖపట్నం

గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తో రోగులు పెరుగుతుంటే సమర్థవంతంగా వైద్యం అందించేందుకు సమన్వయం చేసే ఐ. టి.డి.ఏ పిఓ ను కె.జి.హెచ్ కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ గా ప్రభుత్వం జారీ చేసిన నియామక ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స శుక్రవారం  డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పాడేరు ఐ.టి.డి.ఏ పరిధిలో సుమారు ఆరున్నర లక్షల మంది ప్రజలు ఉన్నారని, గిరిజన ప్రాంతాల్లో  రోజు రోజుకు కోవిడ్ సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందిందని,భౌగోళికంగా విస్తారంగా ఎక్కువ గ్రామాలు, రహదారి నిర్మాణం కూడ సక్రమంగా లేని,అంబులెన్స్ వేళ్ళని గ్రామాలు ఉన్నాయన్నారు.సీజనల్ జ్వరాలకే మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా గిరిజన గ్రామాలు ఉన్నాయన్నారు.పాడేరు జిల్లా ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసిన నేటికి మెరుగైన వైద్యం కోసం రోగులను విశాఖపట్నం తరలిస్తున్నరన్నారు.కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రోగులకు వైద్యం కోసం పాడేరు జిల్లా ఆసుపత్రి లో వెంటిలేటర్ ఆపరేటర్ లేక రోజులు తరబడి నిరుపయోగంగా ఉందన్నారు.అధికారుల అసమర్థత వల్ల10 వెంటిలేటర్ ను విశాఖపట్నం తరలించారన్నారు. పాడేరు,అరకులోయ కోవిడ్ క్వారెంట్ సెంటర్ల ఏర్పాటు చేసిన మౌలిక వసతులు సమకూర్చాలని వారు డిమాండ్ చేశారు. చింతపల్లి, ముంచంగిపుట్టు ఏరియాల్లో కోవిడ్ విస్తరించిన నేటికి కోవిడ్ క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు చేయలేదన్నారు.అరకొరగా ఉన్న వైద్య సేవలు, ఆసుపత్రిలో,క్వారంటైన్ సెంటర్ల కొరవాడిన మౌలిక వసతులు, విస్తరిస్తున్న కోవిడ్ నుండి గిరిజనుల ప్రాణాలు కాపడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ మరణాల పెరుగుతుంన్నా కోవిడ్ టెస్టు రిపోర్ట్ రాక రోగులు అయోమయంలో  ఉన్నారన్నారు.పాడేరు కేంద్రగా ల్యాబ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఇన్ని సమస్యలు ఉంటే గిరిజన ప్రాంతాల  కోసం ప్రత్యేకంగా నియమించిన అధికారి పిఓను కె.జి.హెచ్  కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించి  గిరిజన ప్రాంత ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారన్నారు.గిరిజన ప్రాంతాల్లో ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్షత, నిర్లక్ష్యం తగదన్నారు.

గడువు దాటినా అందని వ్యాక్సిన్,,,, అందేనా !?

గడువు దాటినా అందని వ్యాక్సిన్,,,, అందేనా !?

ఆరిలోవ, పెన్ పవర్

కో వ్యాక్సిన్. టీకాల పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు. తొలివిడత వ్యాక్సిన్ దేవుడెరుగు రెండోవిడత వ్యాక్సిన్ పై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వార్డు కార్పొరేటర్, సచివాలయం సిబ్బంది గాని పి హెచ్ సి సిబ్బంది ఈ విషయంపై ఎటువంటి సమాధానం ఇవ్వలేకపోతున్నారు ప్రజలు అడిగిన ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. తొలి విడత  వ్యాక్సిన్ వేయించుకున్న ప్రజలు రెండో దఫా వ్యాక్సిన్ వేయించుకోవడం లో ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  విమ్స్ ఆసుపత్రి పూర్తిగా కోవిద్ ఆసుపత్రి గా ఉంచడం వలన  వ్యాక్సిన్ విషయంలో ఆరిలోవ హెల్త్ సెంటర్ పై భారం పడింది   హాస్పిటల్ లో సిబ్బంది కొరత,  వేతనాలు జాప్యం వెరసి ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పని భారం పెరగడంతో వ్యాక్సిన్ కోసం వచ్చేవారిని నియంత్రించడం పై పూర్తిగా చేతులెత్తేసారు. సిబ్బంది వారి ప్రయత్నాలు ఎంత చేసినా ప్రజలు సహకరించకపోవడంతో  చేతులెత్తేసారు.

నగరంలో పలు ప్రాంతాల నుండి కరోనా వ్యాక్సిన్ కొరకు ఆరిలోవ హెల్త్ సెంటర్ కు రావడంతో స్థానికులకు వ్యాక్సిన్ దొరకటం లేదని మరియు అధిక సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి హాస్పిటల్ కి తరలిరావడంతో వారిద్వారా కరోనా మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని స్థానికప్రజలు భయపడుతున్నారు. వార్డు కార్పొరేటర్ ఆధ్వర్యనా  సచివాలయంలో వాక్సీన్ అందజేసే చర్యలు చేపట్టక పోవడం వలన ప్రజలు  ఇబ్బందులు  పడుచున్నారు. ఆరిలోవ హెల్త్ సెంటర్ లో కొంతమంది చోటా నాయకులు తమవారికి వ్యాక్సిన్ అందజేసే విషయంలో తమ హవా కొనసాగిస్తూన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన వ్యాక్సిన్ విషయంలో సచివాలయాల ద్వారా స్థానిక ప్రజలకు వ్యాక్సిన్అందజేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఫార్మా కంపెనీలు పరవాడలో ఆక్సిజన్ తో కూడిన కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయండి

 ఫార్మా కంపెనీలు పరవాడలో ఆక్సిజన్ తో కూడిన కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయండి

 

పరవాడ, పెన్ పవర్

ప్రస్తుత పరిసితుల్లో మడలంలో కరోనా విలయ తాండవం చేస్తున్న కారణంగా    జవహర్ లాల్ నెహ్రు ఫార్మాసిటీ(జె.ఎన్.పి.సి) లో గల ఫార్మా కంపెనీ యాజమాన్యాలను పరవాడ మండల ప్రజల ప్రాణ రక్షణ కొరకు కనీసం 50 ఆక్సిజన్ సదుపాయం కలిగి బెడ్ల తో కూడిన కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయాలి అని వైసీపీ జెడ్పిటిసి అభ్యర్థి పి ఎస్. రాజు  విన్నపం చేశారు. గత సంవత్సరం కరోనా కాలంలో ఫార్మా కంపెనీలు రాస్ట్ర ప్రజలకు,సమీప నిర్వాసిత గ్రామ ప్రజలకు మీరు చేసిన సహాయములు,సేవలు,మరువలేనివి అని యాజమాన్యాలకు ధన్యవాదములు తెలియ జేశారు.ఇప్పుడున్న పరిస్తితులలో ఘతం లో కంటే అధిక జనాభా కరోనా తో ప్రతిఘటిస్తున్నారు అని కొందరు ఆక్సిజన్ అందక మృత్యు వాత పడుతున్న కారణంగా ప్రజల ప్రాణాలు కాపాడటానికి సహృదంతో సత్వరమే కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని యజమాన్యాను శుక్రవారంనాడు పత్రికా ముఖంగా వినయపూర్వక అభ్యర్దన చేస్తున్నాను అని రాజు తెలియజేసారు.మీరు చేసే ఈ సేవ ద్వారా సమీప నిర్వాసిత గ్రామ ప్రజలకు మాత్రమే కాకుండా,కంపెనీలలో పనిచేసే కార్మికులకు,మీరు చాలా మేలు చేసిన వారు కాగలరని పి ఎస్.రాజు ఫార్మా యజమాన్యాను అభ్యర్ధించారు.

సి.ఎమ్, రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ద్రోణంరాజు శ్రీవత్సవ్

 సి.ఎమ్, రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ద్రోణంరాజు శ్రీవత్సవ్

మహారాణి పేట, పెన్ పవర్

విశాఖ దక్షిణ నియోజకవర్గం,33వ వార్డు, అమ్మవారివీధి, అల్లిపురం, బొర్రా వేలంకిణి కి స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు వి.ఎమ్.ఆర్.డి.ఏ, ఛైర్మన్గా ఉన్న సమయంలో చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన తదనంతరం వారి కుమారుడు వైఎస్సార్సీపీ యువనాయకులు ద్రోణంరాజు శ్రీవత్సవ్  ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులతో మాట్లాడి తనవంతు కృషి చేసి దక్షిణ నియోజకవర్గం లో కొన్ని  సి.ఎమ్, రిలీఫ్ ఫండ్ చెక్కులను విడుదల చేయించగా ఇందులో భాగంగా ముఖ్యమంత్రివర్యులు వై.యెస్ జగన్మోహనరెడ్డి తన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి(సి.ఎమ్.ఆర్.ఎఫ్) రూ 60,000/-(అరవై వేల రూపాయలు) మంజూరు చేసిన సి.ఎం,రిలీఫ్ ఫండ్ చెక్కును ద్రోణంరాజు శ్రీనివాసరావు తనయుడు ద్రోణంరాజు శ్రీవత్సవ్ చేతుల మీదుగా వేలంకిని కి అందచేయడం జరిగింది.చెక్కును అందుకున్న వారు ఇలాంటి కష్ట కాలంలో డబ్బులు అందించడం అనేది చాలా సంతోషంగా ఉందని  తండ్రి లాగానే మీరు కూడా అతి తక్కువ సమయంలోనే ప్రజలందరికి సూపరిచితులు ఐయ్యారని తండ్రి ద్రోణంరాజు శ్రీనివాసరావు లాగనే ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సుశీల, పచ్చరపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి స్పూర్తి తో ప్రభుత్వరంగాన్ని రక్షంచుకుంటాం సి.ఐ.టి.యు

 అల్లూరి స్పూర్తి తో ప్రభుత్వరంగాన్ని రక్షంచుకుంటాం 

 సి.ఐ.టి.యు

మహారాణి పేట, పెన్ పవర్

వై.రాజు నగర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ అల్లూరి స్పూర్తితో ప్రభుత్వ రంగాన్ని రక్షించుకునే వరకు పోరాడుతాం. ఈరోజు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని సందర్భంగా దీక్ష శిబిరం వద్ద ఆయన ఫోటో కి పూలమాలవేసి దీక్షను ప్రారంభించారు అల్లూరి సీతారామరాజు స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలందరినీ చైతన్యం చేసి మన దేశానికి స్వతంత్రం కోసం ఆనాటి అదే స్ఫూర్తితో దేశ భక్తి ముసుగులో దేశాన్ని విదేశీలకు తాకట్టు పెట్టె విదంగా మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయాలనుకుంటున్నా విధానాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రభుత్వ రంగాన్ని రక్షించుకుందాం. భారతదేశం అభివృద్ధి రావడానికి కారణం లేదా విశాఖపట్నం అభివృద్ధి అవ్వడానికి కారణం ప్రభుత్వ సంస్థలే. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుంటే మోడీకి ఎప్పటికి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బుద్ధి చెప్పారు అయినా మోడీకి బీజేపీకి సిగ్గు రావట్లేదు. మనకు కరోన ఇబ్బంది పెడుతున్న సరే  సరే మన పోరాటం కొనసాగుతుంది ఇదే మన విజయానికి నిదర్శనం. దీక్ష శిబిరంలో అనేక తరగతులకు సంబంధించిన ప్రజలు పాల్గొంటు, ఉద్యమం రోజురోజుకు ఉద్భతం అవుతున్నదన్నారు. స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ రోజు సి. ఐ.టి.యు,నగర కార్యదర్శలు యమ్.సుబ్బారావు, బి.జగన్, డిఅప్పలరాజు చంద్రమౌళి, నర్సింగరావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరావు  78 వ వార్డు కార్పొరేటర్  డాక్టర్ బి గంగారావు జగదాంబ జోన్  నాయకులు, ఎం.జగ్గునాయుడు కమిటీ ఛైర్మన్ పాల్గొన్నారు.

ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, ఆధ్వర్యంలో అన్నదానం

 ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, ఆధ్వర్యంలో అన్నదానం


మహారాణి పేట, పెన్ పవర్

అఖిల భారత మానవ హక్కుల పరిరక్షణ సమితి  గౌరవ చైర్మన్ ఆదేశాల మేరకు  శుక్రవారం 7 మే ఉదయం  కరోనా తో చనిపోయిన వ్యక్తుల ఆత్మ శాంతి చేకూరాలని మన విశాఖ జ్ఞానాపురం రైల్వే స్టేషన్ వైపు ఉన్న నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షురాలైన పిల్ల సత్యవతి  సహయ సహకారాలతో నిర్వహించడినది. ఈ కార్యక్రమానికి గౌరవ చైర్మన్ షేక్ సిరాజుద్దిన్,నేషనల్ జనరల్ సెక్రెటరీ బి కేశవ రావు,రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఇస్మాయిల్, రాష్ట్ర మైనార్టీ సెల్ మహిళా విభాగం అధ్యక్షురాలు షేక్ మున్నీ, రాష్ట్ర మహిళా విభాగం కార్యనిర్వాహక అధ్యక్షురాలు సిహెచ్ ఆదిలక్ష్మి,రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వరరావు,జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కే.శ్రీలత,జిల్లా యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ గౌస్, జిల్లా సెక్రెటరీ కే శ్రీకమల్, జిల్లా కమిటీ మెంబర్ దనేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విమ్స్ హాస్పిటల్ కు ఇంజెక్షన్ల వితరణ

 విమ్స్ హాస్పిటల్ కు ఇంజెక్షన్ల వితరణ

విశాఖపట్నం,పెన్ పవర్

మాజీ శాసనసభ్యులు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు, బిజెపి విశాఖపట్నం పార్లమెంటు జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర విమ్స్ డైరెక్టర్ సత్య ప్రసాద్ ను కలిసారు, అక్కడ కరోణా రోగులకు అందించే చికిత్స గురించి వాకబు చేశారు, కరోణా రోగులకు అవసరమైన ఇంజెక్షన్స్ ఫోండా ఫ్లో,మెప్రేస్సో ఇంజెక్షన్ లను అందజేశారు.ఈ కష్టకాలంలో ముందు ముందు కూడా స్నేహితుల సహకారంతో సహాయం అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేశారు.

రంగులుమీద ఉండే శ్రద్ధ ప్రజారోగ్యం మీద ఉండదా..!గంటా నూకరాజు

 రంగులుమీద ఉండే శ్రద్ధ  ప్రజారోగ్యం మీద ఉండదా..!గంటా నూకరాజు


భీమిలి, పెన్ పవర్

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనీశం చీమకుట్టినట్లు కూడా లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి,  భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు అన్నారు.రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో ప్రజలు బెంబేలెత్తుతుంటే  రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని గంటా నూకరాజు అన్నారు. వ్యాక్సిన్స్ వేసుకోవడం ద్వారా కరోనాను ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారని,దానికి తగ్గట్టుగా దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలు  ఆర్ధిక వ్యవస్థను పక్కనపెట్టి ప్రజారోగ్యం దృష్ట్యా వ్యాక్షిన్స్ కొనుగోలు చేసి ప్రజలందరికీ వేయించే పనిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇలాంటి సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని గంటా నూకరాజు అన్నారు.   కార్యాలయాలకు,కరెంటు  స్థంబాలకు,గోడలకు పార్టీ రంగులు వేసేందుకు,తీసేందుకు  వందల కోట్లు ఖర్చు పెట్టేoదుకు డబ్బులు ఉంటాయి గాని ప్రజారోగ్యం కోసం ఉపయోగపడే వ్యాక్సిన్స్ కొనడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవా అని ప్రశ్నించారు.రోజుకు 20వేలకు పైగా కేసులు రాష్ట్రంలో వస్తున్నా ,మరణాలు రేట్లు విపరీతంగా పెరుగుతున్న ముఖ్యమంత్రి మాత్రం మంగళగిరి కార్యాలయం వదలి రారని అన్నారు.   రాష్ట్రమంతా కోవిడ్ ఆసుపత్రులలో ఆక్సిజన్ లేక రోగులు మరనిస్తుంటే ఏ జిల్లాకు ముఖ్యమంత్రి వెళ్లి ఏమి జరుగుతుందో చూడరని,ప్రజలు ఇంతలా భయాందోళనకు గురవుతున్నప్పటికి  రాజకీయాలమీదే జ్యాస తప్ప ప్రజారోగ్యం మీద లేదని అన్నారు.104కి ఫోన్ చేస్తే 3గంటల్లో కోవిడ్ రోగికి బెడ్ ఏర్పాటు చేస్తారని ముఖ్యమంత్రి చెబుతారు.. ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో 50శాతం బెడ్లు కోవిడ్ బెడ్లుగా మార్చాలని ముఖ్యమంత్రి చెబుతారు.. ఆక్సిజన్ లేక ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ శనిపోలేదని సాక్ష్యాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కే తప్పుడు నివేదికలు ఇస్తారు.. మీరు చెప్పేది ఏదీ నిజం ముఖ్యమంత్రి అని నేను అడుగుతున్నాను.చెప్పే వాటికి ఆచరణలో జరిగేవాటికి సంబంధం లేకుండా చేయడంలో మీరు ఉద్దండులని అన్నారు. పిట్టల్లా జనాలు రాలిపోతుంటే కనీశం చలనం లేకుండా ఉన్న ముఖ్యమంత్రి మీరు తప్ప ఈ దేశంలో ఎవరూ ఉండరని గంటా నూకరాజు అన్నారు.   ఇళ్ల నిర్మాణం అంటారు,బడులకు సెలవులు ఇచ్చి  విద్యాదీవెన అని అంటారు.కరోనా విలయతాండవం చేస్తుంటే పరీక్షలు పెడతామంటారు కానీ ప్రజారోగ్యం పట్టదా అని గంటా నూకరాజు నిలదీశారు.

ప్ర‌తీఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాలి

 ప్ర‌తీఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాలి

జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్

హోం ఐసోలేష‌న్లో ఉన్న‌వారికి కోవిడ్ కిట్లు పంపిణీ

విజ‌య‌న‌గ‌రం, పెన్ పవర్

కోవిడ్ వ‌చ్చిన‌వారితోపాటు, వ్యాధి రాని వారు కూడా వ‌చ్చిన‌ట్టుగానే భావించి, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ .లాల్ కోరారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌తీఒక్క‌రూ ఎంతో అప్రమ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం ఇద‌ని అన్నారు. ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌న‌స‌రిగా మాస్కును ధ‌రించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ, చేతుల‌ను శానిటైజ్ చేసుకోవాల‌ని సూచించారు.  కోవిడ్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ప్ర‌భుత్వం అంద‌జేసిన మెడిక‌ల్ కిట్ల‌ను స్థానిక జిల్లా వైద్యారోగ్య‌శాఖ కార్యాల‌యం వ‌ద్ద బుధ‌వారం ఎఎన్ఎంల‌కు అంద‌జేశారు.ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు విధాలుగా కోవిడ్ చికిత్స‌ను అందిస్తున్నామ‌ని చెప్పారు. వివిధ ర‌కాల దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉండీ కోవిడ్ సోకిన‌వారికి, ఆక్సీజ‌న్ ప‌రిమాణం త‌క్కువ‌గా ఉన్న‌వారికి, ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌వారికి ఆసుప‌త్రుల్లో ఉంచి చికిత్స చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. దీనికోసం 14 ప్ర‌భుత్వ‌, 16 ప్ర‌యివేటు ఆసుప్ర‌తుల‌ను సిద్దం చేశామ‌ని, ప్ర‌స్తుతం 997 మంది వ‌ర‌కూ కోవిడ్ పేషెంట్లు ఆసుప‌త్రుల్లో ఉండి చికిత్స తీసుకుంటున్నార‌ని తెలిపారు.వ్యాధి ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్న‌వారినీ, ల‌క్ష‌ణాలు లేన‌ప్ప‌టికీ, హోం ఐసోలేష‌న్‌లో ఉండ‌టానికి అవ‌కాశం లేనివారినీ ఉంచేందుకు జిల్లాలో ఏడు కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. వీటిలో మొత్తం 3,600 ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని, 24 గంట‌లూ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోపాటు, అవ‌స‌ర‌మైతే వినియోగించేందుకు ఆక్సీజ‌న్‌, మందులు, అంబులెన్సుల‌ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. బ‌ల‌వ‌ర్థ‌క‌మైన ఆహారాన్ని అందించ‌డంతోపాటు, పారిశుధ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టామ‌న్నారు. ప్ర‌స్తుతం 100 మంది వ‌ర‌కూ కేర్ సెంట‌ర్ల‌లో ఉన్నార‌ని క‌లెక్ట‌ర్‌ చెప్పారు.

 హోం ఐసోలేష‌న్‌కు అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్నామ‌ని, వ్యాధి ల‌క్ష‌ణాలు తీవ్రంగా లేనివారికి ఇళ్ల‌లోనే ఉంచి చికిత్స‌ను అందించ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఇలా ప్ర‌స్తుతం సుమారు 5వేల మంది వ‌ర‌కూ హోం ఐసోలేష‌న్‌లో ఉండి చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. వీరంద‌రికీ కోవిడ్ కిట్ల‌ను అంద‌జేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఎఎన్ఎం, ఆశా కార్య‌క‌ర్త‌ల ద్వారా వీరికి కోవిడ్ కిట్ల‌ను పంపిణీ చేస్తున్నామ‌న్నారు. దీనికోసం జిల్లాకు సుమారు 75 వేల కోవిడ్ కిట్లు వ‌చ్చాయ‌ని, వీటిలో 45 వేల కిట్ల‌ను ఇప్ప‌టికే పిహెచ్‌సిల‌కు పంపించ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ఇవి కాకుండా స‌బ్ సెంట‌ర్ల ప‌రిధిలోని ఎఎన్ఎం, ఆశా కార్య‌క‌ర్త‌ల ద్వారా నేరుగా పంపిణీ చేసేందుకు, వారికి సుమారు 22వేల‌ కిట్ల‌ను అంద‌జేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఎంత త్వ‌ర‌గా కిట్ల‌ను పంపిణీ చేస్తే, రోగులు అంత త్వ‌ర‌గా వ్యాధి నుంచి కోలుకుంటార‌ని అన్నారు. అందువ‌ల్ల‌, ఈ కిట్లు పంపిణీని కంట్రోల్ రూముద్వారా ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌న్నారు. జింకు, విట‌మిన్లు, సిట్రిజ‌న్‌, యాంటీ బ‌యాటిక్ టేబ్‌లెట్లు, వాటిని వాడే విధానాన్ని కూడా కిట్ల‌లో పొందుప‌ర్చ‌డం జ‌రిగింద‌న్నారు. వ్యాధి సోకిన‌ప్ప‌టికీ, అధైర్య ప‌డ‌కుండా ధైర్యంగా ఎదుర్కోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.ఈ కార్య‌క్ర‌మంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిప్యుటీ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ చామంతి, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.


ఉదయం 7.30 నుంచి 11.30 గంట‌ల‌ వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్లు

 ఉదయం 7.30 నుంచి 11.30 గంట‌ల‌ వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్లు

జిల్లా రిజిస్ట్రార్ ఎం. సృజ‌న ప్ర‌క‌ట‌న‌


విజ‌య‌న‌గ‌రం,  పెన్ పవర్

కోవిడ్ నియంత్ర‌ణంలో భాగంగా విధించిన క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆదేశాల‌ను అనుస‌రించి జిల్లాలో భూ క్ర‌య‌, విక్ర‌య రిజిస్ట్రేష‌న్ స‌మ‌యాల్లో మార్పు చేసిన‌ట్లు జిల్లా రిజిస్ట్రార్ ఎం. సృజ‌న గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విధించిన క‌ర్ఫ్యూలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి 18వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 7.30 నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాలు పని చేస్తాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం నుంచి త‌దుప‌రి ఆదేశాల వ‌చ్చే వ‌ర‌కు జిల్లాలోని రిజిస్ట్రార్‌, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు ఈ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.


జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ

 జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ     

   

విజయనగరం, పెన్ పవర్


స్థానిక 42వ డివిజన్ పరిధిలో  ఉన్న అయ్యన్నపేట జంక్షన్ మరియు జంక్షన్ వద్దనున్న ఎస్సి కొలనీలో  జనసేన పార్టీ సీనియర్ నాయకులు,జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణరావు(బాలు) ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఇంటిఇంటికీ మాస్కులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర దళిత ఐక్యవేదిక అధ్యక్షులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ రెండో వేవ్ కరోనా తీవ్రతదృష్ట్యా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని బాలు చేపట్టారని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేటప్పుడు డబుల్ మాస్కులు ధరించాలని, ఇటువంటి తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా పనిలేకుండా బయట తిరగరాదని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని,ఇటువంటి సమయంలో ప్రభుత్వం ప్రకటించిన సమయాల్లోనే బయటకు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళిరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు లోపింటి కళ్యాణ్, చిన్న,కృష్ణ, పాల్గొన్నారు.   


కర్ఫ్యూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

 కర్ఫ్యూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

ఎస్.ఐ.ఫకృద్ధీన్,

సాలూరు, పెన్ పవర్

ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిర్ణయించిన కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని సాలూరు పట్టణ ఎస్.ఐ.ఫకృద్ధీన్ సూచించారు. పట్టణంలో గురువారం పట్టణ ఎస్.ఐ కర్ఫ్యూ నిబంధనలు తెలియజేస్తూ దగ్గర ఉండి షాపులను మూయించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ఫ్యూని పాటిద్దాం కరోనాని తరిమిద్దాం, మాస్కు ధరించు భౌతిక దూరం పాటించు శుభ్రత వహించు, నిర్లక్ష్యంగా ఉండకు కరోన బారిన పడకు, అనవసరంగా బయటకు రాకు కరోనాని ఆహ్వానించకు, మీ రక్షణ కోసం మేము రోడ్లుపై ఉన్నాము, మనందరి కోసం బయటకు రావాద్దు అంటూ పట్టణంలో మెయిన్ రోడ్డు గుండా ప్లేకార్డులుతో తమ సిబ్బందితో కలసి ప్రదర్శన చేశారు. సాలూరు సి.ఐ.అప్పలనాయుడు మరియు మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణ లో కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ 12 గంటలకే షాపులన్నింటిని మూసివేయించడం జరిగింది అని ఎస్.ఐ ఫకృద్దీన్ తెలిపారు. అలాగే స్థానిక స్టేట్ బ్యాంకు లో భౌతిక దూరం పాటించాలని అక్కడ ఉన్న బ్యాంకు వినియోగదారులకు సూచించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...