కర్ఫ్యూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
ఎస్.ఐ.ఫకృద్ధీన్,
సాలూరు, పెన్ పవర్ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిర్ణయించిన కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని సాలూరు పట్టణ ఎస్.ఐ.ఫకృద్ధీన్ సూచించారు. పట్టణంలో గురువారం పట్టణ ఎస్.ఐ కర్ఫ్యూ నిబంధనలు తెలియజేస్తూ దగ్గర ఉండి షాపులను మూయించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ఫ్యూని పాటిద్దాం కరోనాని తరిమిద్దాం, మాస్కు ధరించు భౌతిక దూరం పాటించు శుభ్రత వహించు, నిర్లక్ష్యంగా ఉండకు కరోన బారిన పడకు, అనవసరంగా బయటకు రాకు కరోనాని ఆహ్వానించకు, మీ రక్షణ కోసం మేము రోడ్లుపై ఉన్నాము, మనందరి కోసం బయటకు రావాద్దు అంటూ పట్టణంలో మెయిన్ రోడ్డు గుండా ప్లేకార్డులుతో తమ సిబ్బందితో కలసి ప్రదర్శన చేశారు. సాలూరు సి.ఐ.అప్పలనాయుడు మరియు మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణ లో కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ 12 గంటలకే షాపులన్నింటిని మూసివేయించడం జరిగింది అని ఎస్.ఐ ఫకృద్దీన్ తెలిపారు. అలాగే స్థానిక స్టేట్ బ్యాంకు లో భౌతిక దూరం పాటించాలని అక్కడ ఉన్న బ్యాంకు వినియోగదారులకు సూచించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment