మోడీ విధానాలు ఇప్పటికైనా మానుకోవాలి సిఐటియు
మహారాణి పేట, పెన్ పవర్
బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామనుకున్న నరేంద్ర మోడీకి ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని, బిజెపి ఓట్లు తగ్గడానికి కారణం వినాశకరమైన విధానాలే కారణమని సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ కే ఎస్ వి కుమార్ తెలిపారు. ఈ విధానాలు నిలుపుదల చేయకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 32వ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న దీక్ష ను ఆయన ప్రారంభించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోవిడ్ రోగులకు ఆక్సిజన్ను అందించడం, అలాగే ప్రభుత్వ హాస్పిటల్ లో బెడ్స్ కొరతగా ఉండటంతో 1000 బెడ్స్ తయారుచేసి పంపిణీ చేసిందని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వరంగ సంస్థలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచాయని ఎంతోమందికి అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయని అన్నారు. ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ని అమ్ముతామంటే విశాఖ ప్రజలు చూస్తూ ఊరుకోరని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. తక్షణమే ఈ విధానాలు మానుకొని ప్రజల ఆరోగ్యం, ఉపాధిని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మద్దిలపాలెం జోన్ అధ్యక్షులు వి.కృష్ణారావు,నాయకులు అనపర్తి అప్పారావు,కె.కుమారి, ఎం.చంటి, శ్రీనివాస రాజు, పి.దేముడు, యన్.అది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment