Followers

పండుగలు పెళ్ళిళ్ళు వాయిదా వేయాల్సిందే

 పండుగలు పెళ్ళిళ్ళు వాయిదా వేయాల్సిందే…

 నిబంధనలు ఉల్లంఘిస్తే కోవిడ్ చట్ట ప్రకారం చర్యలు.

నెల్లికుదురు తహసిల్దార్. అనంతుల రమేష్ కుమార్

నెల్లికుదురు,పెన్ పవర్

 కరోణ సెకండ్  వేవ్ వేగంగా విస్తరిస్తున్న సందర్భంగా మండలంలోని ప్రజలు ఎవరు కూడా  మాస్కులు లేకుండా బయట సంచరించ కూడదని,  ఒకవేళ అత్యవసర పని ఉన్నట్లయితే మాస్కు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ బయటకి రావాలని మహబూబాద్ జిల్లా నెల్లి కుదురు మండలం తాసిల్దార్ అనంతుల రమేష్ కుమార్ ప్రజలను హెచ్చరించారు మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ గ్రామాలలో ఫంక్షన్లు,  పెళ్లిళ్లు,  ఎలాంటి పండుగలైన జరుపుకునేవారు వాయిదా వేసుకోవాలని,  పెళ్లిళ్లు తప్పనిసరి చేయాలి అనుకునేవారు అధికారుల అనుమతి పొంది కోవిడ్ నిబంధనల మేరకు నిర్వహించు కోవాలని లేనిపక్షంలో కోవిడ్ చట్ట ప్రకారము ఎంతటివారి పైన గాని చర్యలు  తీసుకోబడుతుంది అని తెలియజేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...