నిజమైన ప్రజాసేవకులు ఈ పారిశుధ్య కార్మికులే
పెన్ పవర్, ఆలమూరు
ఆలమూరు మండలం సంధిపూడి పంచాయితీలో పారిశుధ్య కార్మికుల గా పనిచేస్తున్న ఇరువురికి కార్మిక దినోత్సవం సందర్భంగా సర్పంచ్ తోట భవాని నూతన వస్త్రాలను ఇచ్చి గౌరవించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కరోనా ప్రారంభం నుండి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పారిశుధ్య పనులను చేస్తూ ప్రజల ఆరోగ్యం కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వీరి సేవలకు వెలకట్టలేమన్నారు. అలాగే ప్రజలు కూడా పరిసరాలను అపరిశుభ్రత గా ఉంచుకోకుండా జాగ్రత్తగా ఉండటం వలన మాత్రమే ఎటువంటి అనారోగ్యం బారినపడకుండా ఉండి ఈ కరోనా ను దైర్యంగ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందన్నారు. దయచేసి ప్రతీ ఒక్కరూ నిర్లక్ష్యంగా ఉండకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటిస్తూ ప్రంట్ లైన్ వారియర్స్ కి సహకరిస్తూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ బాధ్యతగా నడుచుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment