ఆదివాసీల దాహార్తిని తీర్చిన తాండూర్ సీఐ బాబు రావు
తాండూర్, పెన్ పవర్
ఆదివాసీలకు అండగా నిలిచి వారి తాగునీటి సమస్య పరిష్కరించి మానవత్వం చాటుకున్న తాండూర్ సి.ఐ బాబు రావు సొంత ఖర్చులతో నీటి సమస్య పరిష్కారానికి కృషి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది: తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాబు రావు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిది మంచిర్యాల తాండూర్ పోలీస్ సర్కిల్ పరిధిలోని అబ్బాపూర్ గ్రామంలో తాగడానికి,ఇతర అవసరాలకు నీళ్లు లేకుండా,నీటి సమస్యతో బాధబపడుతూన్న విషయం ని ఆ గ్రామ ప్రజలందరు తాండూర్ సి.ఐ బాబు రావు దృష్టికి తీసుకెళ్లగా సి.ఐ వెంటనే స్పందించి,నిన్న 30వ తేదీన, శుక్రవారం నాడు,అబ్బాపూర్ గ్రామాన్ని సందర్శించి,గ్రామ ప్రజలతో నీటి కొరత గురించి మాట్లాడి సమస్యను ఒక బాధ్యతగా తీసుకుని గ్రామానికి అర కిలోమీటర్ల దూరంలో ఉన్న బావి లో పూడికను తీయించి సిఐ సొంత ఖర్చులతో మోటార్ కొనుగోలు చేసి ఆ బావి నుండి ఊరిలోకి పైప్ లైన్ వేయించి గ్రామ ప్రజల దాహన్ని తీర్చి సి.ఐ బాబు రావు మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ...పోలీసులు కేవలం కేసులను చేధించడమే పని కాకుండా,ప్రజల శ్రేయస్సు,వారి సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ తరుపున ఎల్లప్పుడూ కృషి చేస్తామని ప్రజల రక్షణ మరియు శాంతియుత జీవనం గడిపేలాగా ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది అని సిఐ తెలిపారు. త్రాగటానికి మరియు ఇతర అవసరాల నిమిత్తం అడగగానే వెంటనే స్పందించి నీటి సమస్యలు తీర్చడానికి ఎనలేని కృషి చేసిన సీఐ కి గ్రామస్తులు కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేశారు.
No comments:
Post a Comment