Followers

ఘనంగా మేడే దినోత్సవ వేడుకులు

 ఘనంగా మేడే దినోత్సవ వేడుకులు

నర్సీపట్నం,  పెన్‌ పవర్‌ : 

మోదీ తీసుకువస్తున్న కార్మికల వ్యతిరేక చట్టాలను ఈ మేడే స్పూర్తితో వ్యతిరేకించాలంటూ కార్మికులు శనివారం జెండా ఆవిష్కరించారు. నర్సీపట్నంలో కార్మికులు ఘనంగా జెండా ను ఎగురవేశారు. ముఠా, మున్సిపల్‌, భవన నిర్మాణ రంగం, స్కీమ్‌ వర్కర్స్‌, కాపీ కార్మికులు , పలుచోట్ల జెండాలు  ఎగురవేశారు. కృష్ణాబజారులో జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు  డి.సత్తిబాబు మాట్లాడుతూ మోదీ కార్మికుల కున్న చట్టాలను రద్దు చేస్తున్నారన్నారు.  4 లేబర్‌ కోడ్‌లు గా విభజించారన్నారు.  ఫలితంగా కార్మికులు  మరలా పోరాటాలకు సిద్దం కావాన్నారు. 12 గంటలు  పనిచేయాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగాన్ని అమ్మేసి, దేశాన్ని ఆర్ధికంగా దివాలా తీయీస్తున్నారన్నారు. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టారన్నారు. ఎన్నికల్లో కుంభమేళాలు  పేరిట కరోనాను తిరిగి తెచ్చారన్నారు. కరోణా కాలంలో కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధానాలు  కారాణంగా రాష్ట్రంలో కార్మికులు  ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారన్నారు. భవన నిర్మాణరంగం, ముఠా, మున్సిపల్‌, స్కీమ్‌ వర్కర్స్‌, పలు  ఇబ్బందులు  ఎదుర్కోంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గౌరీ, సామ్రాజ్యం, శివ, నానాజీ, గోవింద, రమణ, యుకె.రావు, నూకరత్నం, పర్వీన్‌, ప్రసన్న, రామకృష్ణ పులువురు కార్మికులు  పాల్గొన్నారు.



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...