ప్రపంచ కార్మికులారా ఏకంకండి
పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ ఛౌక్ సెంటర్లో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే సిపిఐ (ఎంఎల్) లిబరేషన్, ఏ ఐ సి సి టి యు, ప్రజా సంఘాల నాయకత్వంలో జెండా ఆవిష్కరణకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లిబరేషన్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని పిలుపునిచ్చారు. దేశంలో సెకండ్ వేవ్ కరోనా మరణాలకు బిజెపి ప్రధాని మోడీ నిర్లక్ష్యమే కారణం అన్నారు.భారతదేశం కరోనా యాక్షన్ లు గొప్ప విజయం సాధించిందని గొప్పలు చెప్పిన ప్రధాని మోడీ భారత ప్రజలను కరోనా మహమ్మారి కి బలి చేశాడు అని ఆరోపించారు.దేశంలో మోడీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండ గట్టారు. రైతు వ్యతిరేక 3 వ్యవసాయ నల్ల చట్టాలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడం,ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో అన్యాయం, యువతకు ఉద్యోగ ఉపాధి లేకపోవడం, నిత్యావసర ధరల పెరుగుదల, పెట్రోల్ డీజిల్ దేశంలోని ఎన్నడూ ఎరుగని రేట్లు, మహిళలపై దళితులపై అత్యాచారాలు దాడులు,ప్రజా వ్యతిరేక విధానాలతో హిందూ మతోన్మాద పాసిజం నడిపిస్తున్న మోడీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కార్మిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న ఈ తరుణంలో కార్మికులంతా ఏకమై ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం , యువజన సంఘం, విద్యార్థి సంఘం , కూలీలు, రైతులు, ప్రజా సంఘాలు సీపీఐఎంఎల్ లిబరేషన్ , ఏ ఐ సి సి టి యు ప్రజా సంఘాల కార్యకర్తలు , నాయకులు గండే టి నాగమణి, గుమ్మడి రమణ, కందుల ప్రసాద్, జీ సాయి, కందుల సతీష్ ,పిల్లా కాంతం, నాగులాపల్లి అర్జునుడు, బి రాఘవ, గుర్రం గోవింద్, చందక లక్ష్మి, కందుల వరలక్ష్మి ,గుమ్మడి పాదాలమ్మ , వరాలమ్మ ,వడ్డాది గంగాభవాని తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment