ఉపాధి కూలీలు కోవిడ్ నిబంధనలు పాటించాలి
కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఉపాధి హామీ పథకం కూలీలు, సిబ్బంది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పనులు చేయాలని ఏపిఓ సత్యవతి సూచించారు. రావులపాలెం మండలం లక్ష్మీపోలవరం, పొడగట్లపల్లి గ్రామాల్లో జరుగుతున్న కాలువ పనులను గురువారం ఆమె పరిశీలించారు. కోవిడ్ నేపథ్యంలో ఉపాధి కూలీలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు విజయకుమార్, వెంకటనాగేంద్ర పాల్గొన్నారు.
No comments:
Post a Comment