Followers

ఘనంగా మేడే వేడుకలు

ఘనంగా మేడే వేడుకలు

ఎటపాక, పెన్ పవర్

ఘనంగా మేడే వేడుకలు గన్నవరం, క్రిష్ణవరం ,లక్ష్మీపురం ,తోటపల్లి, సీతాపురం ,రంగాపురం ,పట్టుచీర,కన్నాపురం ,భూపతిరావుపేట ,జిన్నగట్ట ,కాపుగొంపల్లి ,నందిగామ, మురుమూరు సీపీఐ అధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. మండలంలోని గన్నవరం లోని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అమరజీవి కామ్రేడ్ కందుకూరి మంగ రాజు గారి స్మారక స్థూపానికి సీపీఐ నాయకులు   జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా మంగ రాజు గారి సతీమణి ఉప సర్పంచ్ కందుకూరి స్వర్ణ  మాట్లాడుతూ కరోనా విపత్తు కార‌ణంగా కార్మిక వర్గానికి రక్షణ, భద్రత కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఇప్పటికైనా కార్మిక వర్గానికి రక్షణ, భద్రత కల్పించాలన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి కార్మికునికి అందివ్వాలన్నారు. వలస కార్మికులకు కరోనా టెస్టులు జరిపి, వారి స్వస్థలాలకు వెంటనే పంపించాలన్నారు. యాజమాన్యాలు కార్మికులకు ఎలాంటి కోత విధించకుండా వేతనాలు ఇవ్వాలని.. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి అమలు చేయించాలన్నారు. కార్మికులు ఎన్నో పోరటాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాలు 12 గంటలకు మార్చాలని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంద‌న్నారు.. ఈ కుట్రలను ఆపివేయాలని హెచ్చరించారు.. మోడీ ప్రభుత్వం కార్మికుల జీవితాలను గాలికి వదిలేసి కార్పొరేట్ కంపెనీలకు సేవలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను, దేశంలోని కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు నిరసించాలన్నారు. పోలవరం ముంపు కి గురవుతున్నా గ్రామాలు ,భూములు నోటిపి కేషన్ ఇస్తున్నా రే తప్ప పరిహారం ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం భద్రామ్మ, సీపీఐ మండల కార్యదర్శి ఎలిసాల నాగరాజు, కందుకూరి సుధీర్ చంద్ర, వాసం రాము, ఎంపిటిసి  ముత్తయ్య,  వరదా బ్రహ్మం, కంటె రాజు, ములిసెట్టి శ్రీను, సున్నం శ్రీను, పిడియాల దుర్గా ప్రసాద్, మైపా సాయి, కుమ్మర పల్లి శ్రీను, సాగర్, కంటె శివ, ఏడిద సుబ్బారావు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...