కార్మిక హక్కుల రక్షణకై మరో చికాగో పోరాటానికి సిద్ధం కావాలి
విజయనగరం, పెన్ పవర్
సిపిఐ, ఏఐటీయూసీ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మరియు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో స్థానిక మర్క్స్ నగర్ ( బుచ్చెన్న కోనేరు ) శాఖలో 3 చోట్ల, బలిజివీధి శాఖలో 2 చోట్ల, శాంతినగర్ శాఖలో 1 చోట, విజయనగరం పి.డబ్ల్యూ మార్కెట్ ఎంప్లాయిస్ అండ్ ముఠా వర్కర్స్ యూనియన్ శాఖలో 4 చోట్ల, సిపిఐ జిల్లా కార్యాలయం మీద సిపిఐ, ఏఐటీయూసీ 2 జెండాలు మొత్తం 11 చోట్ల జరిగిన 135 వ మేడే దినోత్సవ వేడుకలు రెండవ వేవ్ కరోనా నిబంధనలు పాటిస్తూ ఎర్రజెండాలు ఎగురవేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. 135 వ మేడే వర్ధిల్లాలని, ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, కార్మికులను యజమానులు దగ్గర బానిసలుగా చేయడానికి మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కొడ్లను రద్దు చేయాలని, అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలను, పరిశ్రమలను ప్రైవేటీకరణ ఆపాలని, ప్రజలందరికీ కరోనా టీకాని ఉచితంగా అందించాలని నినాదాలు చేశారు. అనంతరం బుగత అశోక్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా మహమ్మారి 2 వ వేవ్ లో ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన అతిప్రమాధకరంగా విజృంభించడంతో దేశంలో మెరుగైన వైద్య సదుపాయాలు లేకపోవడం వలన ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా అలాంటి భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజా వ్యవస్థ పరిరక్షణ కోసం, దేశ సంపదను మరింతగా పెంచేందుకు, ప్రజలకి ఆహారాన్ని అందించడానికి చమటోడ్చి కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు, కర్షకులకి 135 వ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవంగా మేడే ను 135 ఏళ్ళుగా శ్రామికజన సంఘీభావ చిహ్నాంగా, కార్మిక పర్వదినంగా మేడేను జరుపుకుంటున్నామని అన్నారు. అమెరికా, యూరప్ దేశాలలో 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం కారణంగా స్థాపించబడిన భారీపరిశ్రమల్లో పనిచేయుటకు కార్మికుల అవసరం ఏర్పడిందన్నారు. అప్పటి నుంచి ఉత్పత్తిరంగంలోని పెట్టుబడిదారులు, కార్మికులు రెండు వర్గాలు పుట్టాయన్నారు. పెట్టుబడిదారులు అధిక లాభాల కోసం కార్మికుల శ్రమను దోచుకోవడం మొదలు పెట్టారన్నారు.
శ్రామికులచే బానిసల్లా పనిచేయించేవారు. పిల్లలు మహిళలు అనే విచక్షణ లేకుండా కర్మాగారాలలో, గనులలో గొడ్డు చాకిరీ చేయించేవారని అశోక్ తెలియచేశారు. కనీస వసతులైన తిండి, బట్ట, గూడు వంటి ఉండేవి కాదని తెలిపారు. రోజుకు 16 నుంచి 20 గంటలు కార్మికుల చేత గొడ్డు చాకిరీ చేయించేవారని తెలిపారు. ఈ దారుణ చర్యల నేపధ్యంలో కార్మికులలో క్రమక్రమంగా తిరుగుబాటు మొదలైందన్నారు. గొడ్డు చాకిరీ చేయించుకుంటున్న పెట్టుబడిదారీ వర్గం పై ఉధ్యమాలకు కార్మికులు సంఘటితమయ్యారు. ఆనాటి నుండి కార్మిక సంఘాల నిర్మాణం ప్రారంభించారన్నారు. 1764-1800 మధ్య బ్రిటన్‌లోనూ, ఆ తరువాత యూరప్‌లోనూ, ట్రేడ్ యూనియన్ల నిర్మాణం జరిగిందన్నారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో కార్మికులు చైతన్యవంతులై 1806లో మెకానిక్స్ యూనియన్ పేరిట తొలి కార్మిక సంఘాన్ని స్థాపించుకొన్నారని తెలిపారు. పనిగంటలు తగ్గించాలని, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని, కర్మాగారాలలో కనీస వసతులు కల్పించాలని, కోరుతూ కార్మిక వర్గం విప్లవ శంఖం పూరించిందన్నారు. ఆ పోరాట జ్వాలలు బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీ దేశాలకు, అమెరికాలోని మిగతా ప్రాంతాలకు వ్యాపించాయని అశోక్ తెలిపారు. ఫిలడెల్ఫియాలో మెకానిక్స్ యూనియన్ 1827లో తమకు 8 గంటల పనిదినం కోసం పోరాటం ప్రారంభించిందన్నారు. ఆ కార్మికోద్యమం దావాలంగా వ్యాపించి ఉధృతం కావడంతో. ప్రభుత్వం దిగివచ్చి 1837లో 10 గంటల పనిదినంను చట్టబద్ధం చేసిందన్నారు. 1881లో చికాగో నగరంలో వివిధ కార్మిక సంఘాలు సంఘటితంగా అమెరికా ఫెడరేషన్ ఆఫ్ లేబర్ పేరిట ఒక సమాఖ్యను కొత్తగా ఏర్పాటు చేసుకున్నాయన్నారు. ఆ సమాఖ్య 1884 అక్టోబరు 7న ఎనిమిది గంటల పనిదినంను చారిత్రాత్మక తీర్మానం చేసిందన్నారు. 1886 మే మొదటి తేదీన కార్మిక వర్గం సమ్మె పోరాటం జరపాలని నిర్ణయించిందన్నారు. 1885-86లో మేడే సన్నద్ధతకు జరిగిన సమ్మెపోరాటాల్లో లక్షలాది కార్మికులు పాల్గొన్నారన్నారు. 1886లో జెనీవాలో జరిగిన మొదటి ఇంటర్‌నేషనల్ మహాసభ కూడా రోజుకు 8 గంటలు పనిని చట్టబద్ధం చేయాలని కోరిందన్నారు. 1886 మే 1 వ తేదీన చికాగోలో 8 గంటల పనిదినం సమ్మె జరిగిందన్నారు. ఆ సమ్మెలో మూడున్నర లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని అన్నారు. దీంతో కార్మికులపై మే 3న ప్రభుత్వం కాల్పులు జరిపిందన్నారు. ఆ కాల్పుల్లో ఆరుగురు కార్మికులు అమరులయ్యారన్నారు. కార్మిక ఉద్యమానికి నాయకత్వం వహించిన కార్మిక నాయకులను పట్టుకొని ఉరి తీశారని తెలిపారు. మే1న ప్రారంభమైన మహోద్యమం బాల్టిమెన్, న్యూయార్క్, వాషింగ్‌టన్, పిట్సు, డెట్రాన్ వంటి పెద్ద నగరాలకు దావానలంలా వ్యాపించింది. కార్మికుల హక్కుల కోసం వీరోచితంగా పోరాటాలు, త్యాగాలు చేశారన్నారు. 1889 లో సోషలిస్టు అంతర్జాతీయ మహాసభ రెండవ ఇంటర్‌నేషనల్ లో మే 1వ తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. ఆ రోజున అన్ని దేశాలలోని కార్మికులు ఏకకాలంలో తమ కోర్కెలను ప్రకటించాలని ఆదేశించింది. 1890 మే 1వ తేదీన ఐరోపా దేశాలలో తొలిసారిగా మేడే జరపడం జరిగిందన్నారు. మనదేశంలో కార్మికుల జీవితాలకు సవాలుగా నిలిచిన మతతత్వం, నూతన ఆర్థిక సంస్కరణల ఫలితంగా బహుళజాతి సంస్థల శ్రమ దోపిడీ నుంచి కాపాడుకునేందుకు దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను, పరిశ్రమలను, కార్మిక హాక్కులను రక్షించుకునేందుకు చికాగో నగర పోరాటాన్ని స్మరించుకుంటూ నేడు బీజేపీ అవలంభిస్తున్న ఆర్ధిక, సామాజిక దోపిడీ విధానాల పై పోరాటాలు కొనసాగించాలని బుగత అశోక్ పిలుపునిచ్చారు. మేడే కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు టి.జీవన్, పార్టీ శాఖా కార్యదర్సులు, యూనియన్ నాయకులు కెల్ల సూర్యనారాయణ, నడిపేన పాపునాయుడు, పతివాడ శ్రీను, చిన్న, అప్పరుబోతు జగన్నాధం, చిల్లా చిట్టిబాబు, పొందూరు అప్పలరాజు, పొందూరు రాంబాబు, ఎస్.సునీల్, బూర వాసు, పి.గౌరీశంకర్, ఎమ్.రాజేష్, కొండలరావు, తదితరులు పాల్గున్నారు.
No comments:
Post a Comment