గొడ్డిపుట్టు ఉపాధి కూలీలకు మాస్క్ లు పంచిన వి.ఆర్పీ
ముంచంగిపుట్టు ,పెన్ పవర్
కరోనా బారిన పడకుండా ఉపాధి కూలీలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించాలని ఎన్ఆర్ఈజీఎస్ వి ఆర్ పి వెంగడ చంద్ర అన్నారు.శుక్రవారం సుజన కోట పంచాయితీ గొడ్డి పుట్టు గ్రామంలో ఉపాధి కూలీలకు మాస్క్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ దశ కరోనా విలయ తాండవం ఆడుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొదటి విడత కరోనా మాదిరి నిర్లక్ష్యం చేయవద్దని ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. ఉపాధి కూలీలు పనులు చేసే సమయంలో మాస్కులు ధరించాలి అని గుంపులు గుంపులుగా ఉండకుండా భౌతిక దూరం పాటించక తప్పదు అన్నారు. పనులు పూర్తి అయ్యాక కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలన్మారు. గ్రామం విడిచి వెళ్లవద్దని ఇల్ల కే పరిమితం కావాలని అన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుని ఎటువంటి అనారోగ్యం వచ్చినా ఆశ కార్యకర్త ఏఎన్ఎం లను సంప్రదించాలని సూచించారు. నిత్యం ఉపాధి పనులు చేసే కూలీలు మాస్కులు భౌతిక దూరం తప్పనిసరిగా ఆచరించాలని వీ ఆర్ పి చంద్ర కోరారు. అతని వెంట టి ఏ కూడా పాల్గొన్నారు.
No comments:
Post a Comment