అనాధల పాలిట ఆత్మీయుడు...
మహారాణి పేట, పెన్ పవర్
అనాధ వృద్ధులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు, పండ్లు పంపిణీ మధ్యాహ్నం అన్నదానం ఏసీబీ డీఎస్పీ రంగరాజు అనాధల పాలిట ఆత్మీయుడిగా నిలిచారు. అనాధల కోసం తరచూ అన్నదానం, వస్త్ర దానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.విశాఖ వన్టౌన్లో ఉన్న వివేకానంద అనాధ ఆశ్రమంలో ప్రముఖ సంఘ సేవకులు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రంగరాజు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనాధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు పండ్లు,మాస్కులు అందజేశారు..మధ్యాహ్నం అన్నదానం చేశారు.అనాధ ఆశ్రయంలో ఆశ్రయం పొందుతున్న అనాధల కోసం ఆయన తరచూ ఇక్కడ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.అనాధలను తన కుటుంబ సభ్యులుగానే భావిస్తూ కాసేపు వారితో సంతోషంగా గడుపుతారు అనాధలంతా ఆయనను ఆత్మీయుడుగా భావిస్తూ ఆయన రాకకోసం ఎదురు చూస్తూ ఉంటారు.ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా ఈ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని,భౌతిక దూరం పాటించాలని పలు సూచనలు తెలిపారు.
No comments:
Post a Comment