ఆట పోటీలు అన్న తర్వాత గెలుపు ఓటములు సహజం...
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
బేల, పెన్ పవర్ఆటల పోటీలు అన్న తర్వాత గెలుపు ఓటములు సహజమని ఓడిపోయిన వాళ్లు నిరాశ పడకుండా ముందుకెళ్లే పట్టు సాధించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మంగళవారం మండలంలోని చప్రాల గ్రామంలో లో గత 15 రోజుల నుంచి నిర్వహించిన క్రికెట్ పోటీలు నేటితో ముగిశాయి. మొదటి బహుమతి చాంద్ పెళ్లి జట్టుకు జోగు పౌండేషన్ తరఫున రూ31,000, రెండో బహుమతి చప్రాల జట్టుకు జడ్పిటిసి సభ్యులు అక్షిత సతీష్ పవార్ తరఫున (ఆడానేశ్వర్ ఫౌండేషన్ )రూ 15,000,గెలుపొందిన జట్లకు బహుమతులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న యువకుల ప్రతిభను వెలికి తీయడానికి గ్రామా గ్రామాల్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామ యువకులు గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, ఆడణేశ్వర పౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్ర శేఖర్, స్థానిక సర్పంచ్ దౌలత్ రావు, టిఆర్ఎస్ నాయకులు దేవన్న, సతీష్, ప్రవీణ్ , జగన్నాథ్,ప్రకాష్ రెడ్డి,గేడం సునీల్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment