Followers

కోవిడ్ కష్ట కాలలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్నాం

 కోవిడ్ కష్ట కాలలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్నాం

మెంటాడ, పెన్ పవర్ 

ప్రాణాలకు తెగించి రేయింబవళ్ళు వైద్య సేవలు అందిస్తున్నామని, మాపై లేనిపోని ఆరోపణలు చేయడం విశాఖ ఎక్స్ప్రెస్ పత్రికల్లో డబ్బులు తీసుకున్నట్లు, కోవిడ్ టీకా డోసు తక్కువ చేసి ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు వచ్చిన అవాస్త వార్తకు ఆమె స్పందించారు.   స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర లో కరోనా కష్ట కాలం లో అనేక సేవలు తనతో పాటు సిబ్బంది ఒకవైపు కోవిడ్ పరీక్షలు వాటి ఫలితాలు అందించడం,మరో వైపు వ్యాక్సినేషన్ చేయడం, అంతే కాకుండా ముఖ్యంగా అనేక సమస్యలు తో వచ్చే రోగులకు సేవలు అందించడం ,గర్భిణీ స్త్రీలు కు ప్రసవాలు జరపడం,కోవిడ్ లక్షణాలు ల తో టెస్ట్ లు చేసుకోకుండా వచ్చిన వారికి కూడా ప్రధమ చికిత్స అందించడం అనంతరం టెస్ట్ లు జరిపి పాజిటివ్  వస్తే రిఫర్ చేయడం లాంటి సేవలు అందిస్తున్నామని మాపై లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెడ్డ పేరు రావడంతో పాటు రోగులకు నమ్మకం పోతుందని ఆమె పేర్కొన్నారు. మాకు కుటుంబాలు ఉన్నాయి వారిని పక్కనబెట్టి ప్రజలకు సేవ చేయడానికి వైద్య వృత్తిని చేపట్టామని తెలిపారు. మీరు సహకరించక పోయినా పర్వాలేదు కానీ ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళ్తుందని ఆమె విజ్ఞప్తి చేశారు. ఏడాదిలో మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు గుర్తించి జిల్లా కలెక్టర్ చేతుల మీదగా ప్రశంస పత్రాలు, అవార్డులను అందుకున్న ఘనత మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉందని ఆమె పేర్కొన్నారు.  తప్పు చేస్తే నిలదీయండి, అలాగే మేము తప్పు చేసినట్లు మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయో చూపించాలని ఆమె పేర్కొన్నారు. విశాఖ ఎక్స్ప్రెస్ పత్రిక రిపోర్టర్ ఎవరో కూడా నాకు గాని, మా సిబ్బందికి గాని తెలియదని అటువంటి వ్యక్తి ఏ ఆధారాలతో వార్త రాశారు అని ఆమె ప్రశ్నించారు.

నిజంగా తప్పు చేస్తే ఎవరైనా వార్త రాయవచ్చని ఆమె పేర్కొన్నారు. మాతోపాటు మీడియా మిత్రులు సహాయం కూడా అవసరం ఎంతో ఉందని వారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తే కరోనా ను విజయవంతం ఎదుర్కోగల మని ఆమె పేర్కొన్నారు. అనుమానితులు, పాజిటివ్ కేసులు మధ్య లో ఉండి సేవలు అందిస్తున్న సిబ్బంది సేవలు మరిచిపోలేం అని గ్రామస్తులు, పలువురు రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకారం అందిస్తే ఇంకా ఉత్తమ సేవలు అందిస్తాం అని తెలియచేశారు.  ఎవరికి వారే స్వచ్చంద లాక్ డౌన్ ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రజలు తీసుకున్న జాగ్రత్త లే వారి  కుటుంబాలకు శ్రీ రామ రక్ష అని అన్నారు. అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎక్కువ శాతం బయటకు రాకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి అన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది, గ్రామ ,మండల , జిల్లా అధికారులు విధులు ముగించుకొని ఇంటికి వెళ్లి కుటుంబాలు తో ఆనందంగా గడుపుతున్నారని అనుకుంటున్నా రేమో కానే కాదు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరు తమ ఇంటికి చేరి వేరేగానే ఉంటారు ఎందుకు అంటే తమకు కోవిడ్ సోకె ప్రమాదం ఎక్కువ కావున ఇంటికి వెళ్లి తమ బిడ్డలను కూడా ఎత్తుకునే పరిస్థితి లేదు అని ఆమె పేర్కొన్నారు. పక్క ఇంటిలో కోవిడ్ పేషంట్ ఉంటేనే మనం తట్టుకోలేని పరిస్థితి లో ఉన్నాం అని అన్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న మా మీద లేనిపోని ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. కరోనా రెండో దశలో ఉన్నందున ప్రజలు అందరు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకారం అందిస్తారని ఆమె విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...