ఏఎస్ఐ వీరభద్రరావు సేవలు మరువలేనివి
విధినిర్వహణలో అంకితభావంతో పనిచేసి, అందించిన సేవలు మరువలేనివని కాకినాడరూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ అన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఏఎస్ఐ పబ్బినీడి చినవీరభద్రరావు పదవీవిరమణ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగస్తులకు పదవీవిరమణ తప్పదని, అయితే పదవీకాలంలో చేసిన సేవలే ప్రజల్లో గుర్తుండిపోతాయన్నారు. కరప ఎస్ఐ డి. రామారావు మాట్లాడుతూ కానిస్టేబుల్, హెచ్సీగా, ఏఎస్ఐగా అందించిన సేవలు అందరికీ ఆదర్శమన్నారు. ఈసందర్భంగా కరప పోలీసు స్టేషన్ సిబ్బంది తరపున ఏఎస్ఐ చినవీరభద్రరావు, శివకుమారి దంపతులను సీఐటీ మురళీకృష్ణ ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకులు గొల్లపల్లి ప్రసాదరావు, సవిలే రాజేష్, వజ్రపు కామేశ్వరరావు, ఏఎస్ఐ జి. ప్రసన్నకుమార్, హెచ్సీ పి. రాజారావు, కె. చిట్టిబాబు, శ్రీనివాస్, హరిబాబు, శివ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment