జూన్ రెండోవారంకు ఐదులక్షల టన్నుల ఇసుకను
నిల్వ ఉంచే విధంగా చర్యలు : జే.సీ. రెవెన్యూ కె. వెంకట రమణా రెడ్డి
కొవ్వూరు, పెన్ పవర్ :
జిల్లాలో రాబోయే వర్షా కాలంలో జూన్ 15 వ తేదీ నాటికి సుమారు 5 లక్షల ట న్నుల ఇసుకను నిల్వ ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రెవె న్యూ కె. వెంకట రమణా రెడ్డి అన్నారు. కొవ్వూ రు ఆర్డీవో కార్యాలయం లో శనివారం ఏ పి.యం.డి.సి. అధికారులతో, ఇసుక ర్యాంపు ల్లో ఉన్న ఇసుక సొసైటీ నిర్వాహకుల తో సమీక్ష సమా వేశం నిర్వహించారు.
ఈ సంద ర్భంగా వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ ఇసుక ఉత్ప త్తి పెంచే విధంగా చర్యలు తీసు కోవాలని అన్నారు.ఇసుక పట్టా ర్యాంపులు, ఓపెన్ ర్యాం పులు, డీ సిల్టేశన్ ర్యాం పులు, ఇసుక డిపోలు, త్వరిత గతిన ప్రారం భించే విధంగా చర్యలు తీసు కోవాలని అన్నారు28డీసిల్టేశన్ ర్యాంపు ల్లో సుమారు 18 మాత్రమే పనిచేస్తున్నాయని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు వెళ్లి పోవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని, వాళ్ళని వెనక్కి పిలిచి అన్ని ర్యాంపు లు పనిచేసే విధంగా చర్యలు తీసు కోవడం జరుగుతుంది అని అన్నారు. 10 పట్టా ర్యాంపు లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అని అన్నారు. 22 ఓపెన్ ర్యాంపు ల్లో 7 నుండి 8 మాత్రమే పని చేయడం జరుగు తోంది అని అన్నారు. ఇసుక ఉత్ప త్తీ నీ పెంచేందుకు అన్ని ర్యాంపు లు తెరిపించాలని ఏ పి.యం.డి.సి. అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి అని 4 రకాల పోస్టర్స్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ రెవె న్యూ కె. వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ టీకాలు తప్పని సరిగా వేయించు కోవాలి అని అన్నారు. కరోనా వైరస్ కి సంభందించి ఏటువంటి ఇబ్బందులు ఉంటే 104 కి కాల్ చెయ్యాలి అని అన్నారు. ప్రజ లందరూ అప్రమత్తం గా ఉం డి, వైరస్ వ్యాప్తి నీ నియంత్రించి, మనమందరం ప్రాణాలను కాపా డుకుందామని అని అన్నారు. మాస్క్ లు, సాని టైజర్ లు, భౌతిక దూరం ప్రజలు తప్పనిసరిగా పాటిం చాలి అని అన్నారు. వాలంటీర్ ల ద్వారా జ్వరం ఎవ్వరికీ వచ్చింది అనే దాని గురించి సర్వే నివహిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ టెస్టు లు చాలా వరకు పెంచడం జరి గింది అని, చేసిన 24 గంటల్లో రిపోర్ట్ లు వస్తున్నాయి అని అన్నారు. ప్రస్తుతం 3 వేల 600 బెడ్ లు ఉన్నాయని, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు సుమారు 5 వేల బెడ్ ల వరకు పెంచడం జరిగు తుం ది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో, డి.లక్ష్మారెడ్డి, డి.ఎస్.పి. బి.శ్రీనాథ్, సి. ఐ, సురేష్, ఏ పి.యం.డి.సి. అధికా రీ, తదితరులు పా ల్గొన్నారు.
No comments:
Post a Comment