మున్సిపల్ ఆఫీసు ఆవరణలో మే డే సంబరాలు.
మంచిర్యాల, మే 1, పెన్ పవర్మంచిర్యాల పట్టణంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు సుద్ధమల్ల హరికృష్ణ మున్సిపల్ ఆఫీసు ఆవరణలో మేడే సంబరాలు నిర్వహించామని పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ 135 వ మే డే సంబరాలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఆశయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏం తిరుపతి, సుధాకర్, సత్తయ్య, నవీన్, నరసయ్య కుమార్ మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment