కోవిడ్ టీకా సెకండ్ డోసు తీసుకున్న జడ్పీటీసీ చారులత రాథోడ్...
ఉట్నూర్, పెన్ పవర్కోవిడ్ వ్యాక్సిన్ టీకాను ప్రతిఒక్కరూ వేసుకోవాలని ఉట్నూర్ జడ్పిటిసి చారులత రాథోడ్ సూచించారు. మంగళవారం ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వారి భర్త రాథోడ్ శైలెందర్ తో కలిసి కోవిడ్ సెకండ్ డోస్ వ్యాక్సిన్ ని వేసుకున్నారు.వారితో పాటు పంచాయతీ రాజ్ ఎస్.ఈ. జాదవ్ వెంకట్ రావ్ దంపతులు ఉపాధ్యాయుడు చౌహాన్ రమేష్ దంపతులు టీకాను వేసుకున్నారు. ఈ సందర్భంగా జడ్పిటిసి చారులత రాథోడ్ మాట్లాడుతు కరోనా కట్టడికి టీకాయే మార్గమని, కోవిడ్ వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరు 45 ఏళ్ళు పైబడిన వారు టీకాను వేసుకోవాలని సూచించారు. ఉట్నూర్ మండల ప్రజలందరు టీకా కోసం నేటి నుండి ఆన్లైన్ లో selfregistration.cowin.gov.in లో తమ వివరాలు నమోదు చేసుకొని ఆసుపత్రికి వెళ్ళి టీకా వేసుకోవాలన్నారు.
No comments:
Post a Comment