కె.జి.హెచ్ కోవిడ్ ప్రత్యేక అధికారిగా ఐటిడిఏ పిఓ నియామకం రద్దు చేయాలి.
చింతపల్లి, ముంచింగ్ పుట్ లో కోవిడ్ సెంటర్ ప్రారంభించాలి
గిరిజన సంఘం డిమాండ్
పెన్ పవర్ బ్యూరో, విశాఖపట్నంగిరిజన ప్రాంతాల్లో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తో రోగులు పెరుగుతుంటే సమర్థవంతంగా వైద్యం అందించేందుకు సమన్వయం చేసే ఐ. టి.డి.ఏ పిఓ ను కె.జి.హెచ్ కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ గా ప్రభుత్వం జారీ చేసిన నియామక ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స శుక్రవారం డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పాడేరు ఐ.టి.డి.ఏ పరిధిలో సుమారు ఆరున్నర లక్షల మంది ప్రజలు ఉన్నారని, గిరిజన ప్రాంతాల్లో రోజు రోజుకు కోవిడ్ సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందిందని,భౌగోళికంగా విస్తారంగా ఎక్కువ గ్రామాలు, రహదారి నిర్మాణం కూడ సక్రమంగా లేని,అంబులెన్స్ వేళ్ళని గ్రామాలు ఉన్నాయన్నారు.సీజనల్ జ్వరాలకే మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా గిరిజన గ్రామాలు ఉన్నాయన్నారు.పాడేరు జిల్లా ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసిన నేటికి మెరుగైన వైద్యం కోసం రోగులను విశాఖపట్నం తరలిస్తున్నరన్నారు.కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రోగులకు వైద్యం కోసం పాడేరు జిల్లా ఆసుపత్రి లో వెంటిలేటర్ ఆపరేటర్ లేక రోజులు తరబడి నిరుపయోగంగా ఉందన్నారు.అధికారుల అసమర్థత వల్ల10 వెంటిలేటర్ ను విశాఖపట్నం తరలించారన్నారు. పాడేరు,అరకులోయ కోవిడ్ క్వారెంట్ సెంటర్ల ఏర్పాటు చేసిన మౌలిక వసతులు సమకూర్చాలని వారు డిమాండ్ చేశారు. చింతపల్లి, ముంచంగిపుట్టు ఏరియాల్లో కోవిడ్ విస్తరించిన నేటికి కోవిడ్ క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు చేయలేదన్నారు.అరకొరగా ఉన్న వైద్య సేవలు, ఆసుపత్రిలో,క్వారంటైన్ సెంటర్ల కొరవాడిన మౌలిక వసతులు, విస్తరిస్తున్న కోవిడ్ నుండి గిరిజనుల ప్రాణాలు కాపడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ మరణాల పెరుగుతుంన్నా కోవిడ్ టెస్టు రిపోర్ట్ రాక రోగులు అయోమయంలో ఉన్నారన్నారు.పాడేరు కేంద్రగా ల్యాబ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఇన్ని సమస్యలు ఉంటే గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేకంగా నియమించిన అధికారి పిఓను కె.జి.హెచ్ కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించి గిరిజన ప్రాంత ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారన్నారు.గిరిజన ప్రాంతాల్లో ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్షత, నిర్లక్ష్యం తగదన్నారు.
No comments:
Post a Comment