ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ ని అరికట్టండి
రాజమహేంద్రవరం, పెన్ పవర్
రాజమహేంద్రవరం నగరంలో కోవిడ్ వ్యాధి అత్యవసర పరిస్థితిని ఆసరా చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంటున్నాయని సి.పి.ఎం జిల్లా కమిటీ విమర్శించింది. ఈ మేరకు సి.పి.ఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ ఒక ప్రకటన ద్వారా జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీని అరికట్టాలని కోరారు.ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాకుండా లక్షల్లో దండుకుంటున్నారని, పైగా రెమిడేసిఫర్ ఇంజెక్షన్ రోగులు తెచ్చుకోవాలని తమకు సంబంధం లేదని తిప్పడం ఆ తరువాత బ్లాక్ లో లక్షలు గుంజటం ప్రైవేట్ ఆస్పత్రుల వ్యాపారంగా మారిందని మండిపడ్డారు.ప్రజలను ఆదుకోవాల్సిన ప్రైవేట్ వైద్యరంగం ఇలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి ని సొమ్ము చేసుకోవడం దుర్మార్గమని నగరంలో ఉన్న ప్రజా ప్రతినిధులు,అన్ని రాజకీయ పార్టీల నాయకులు దీనిపై స్పందించాలని అరుణ్ కోరారు.అఖిల పక్ష పార్టీలు,సంస్థల సమావేశం జరిపి ఈ పరిస్థితి ని అధిగమించడానికి చర్యలు చేపట్టాలని కోరారు.
No comments:
Post a Comment