బాలుడి వైద్య ఖర్చులు భరిస్తా - మైనంపల్లి రోహిత్
రామసాయి నైనిశ్ కు అండగా ఉంటా
మెరుగైన వైద్య సేవలు అందించాలి - రోహిత్
పెన్ పవర్, మల్కాజిగిరిబాలుడు రామసాయి నైనిశ్(5) వైద్య ఖర్చులు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ట్రస్టు భరిస్తుందని ట్రస్టు చైర్మన్ మైనంపల్లి రోహిత్ తెలిపారు. శనివారం మౌలాలి ఎంజేకాలనీలో నివాసం ఉండే దనుంజయ్ శర్మ సాయి సిందూజ కొడుకు నైనిశ్ విద్యుత్ షాక్ కు గురైయి ఏఎస్ రావునగర్ అంకూర్ అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతు నైనిశ్ ను మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ట్రస్టు చైర్మన్ మైనంపల్లి రోహిత్ పరమార్శించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి బాలుడి చికిత్స కోసం ఆయ్యే వైద్య ఖర్చులను భరిస్తామని తెలిపారు. అసుపత్రిలో వైద్య ఖర్చులు మీరూ చెల్లించాల్సిన పనిలేదని అన్నారు. అసుపత్రి యజమాన్యంతో మాట్లాడి వైద్య ఖర్చులు మైనంపల్లి ట్రస్టు భరిస్తుందని తెలిపారు. బాలుడికి మెరుగైన వైద్య సేవలు అందించి ఇంటికి వచ్చే వరకు తన బాధ్యత అన్ని రోహిత్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్షి జీ.ఎన్.వి సతీష్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు అమీనొద్దీన్, ఎం.బాగ్యనందరావు, ఉపేందర్ రెడ్డి, సంతోష్ నాయుడు, మహేష్ గౌడ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment