కోవిడ్ నిబంధనల నడుమ విగ్రహ ప్రతిష్ఠ
గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్
గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట రామాలయం ఆలయ ప్రాంగణంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కోవిడ్ నిబంధనల నడుమ జరిగింది. గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మద్ది. ఢిల్లీశ్వరరావు,కుసుమా దంపతులు సుమారు లక్షా తొంభై వేల రూపాయలు సొంత నిధులను వెచ్చించి ప్రతిష్ట కార్యక్రమాన్ని శాస్ర్తోత్తమంగా నిర్వహించారు ఈ కార్యక్రమంతో పాటుగా కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టాలని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
No comments:
Post a Comment