Followers

రంగులుమీద ఉండే శ్రద్ధ ప్రజారోగ్యం మీద ఉండదా..!గంటా నూకరాజు

 రంగులుమీద ఉండే శ్రద్ధ  ప్రజారోగ్యం మీద ఉండదా..!గంటా నూకరాజు


భీమిలి, పెన్ పవర్

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనీశం చీమకుట్టినట్లు కూడా లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి,  భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు అన్నారు.రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో ప్రజలు బెంబేలెత్తుతుంటే  రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని గంటా నూకరాజు అన్నారు. వ్యాక్సిన్స్ వేసుకోవడం ద్వారా కరోనాను ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారని,దానికి తగ్గట్టుగా దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలు  ఆర్ధిక వ్యవస్థను పక్కనపెట్టి ప్రజారోగ్యం దృష్ట్యా వ్యాక్షిన్స్ కొనుగోలు చేసి ప్రజలందరికీ వేయించే పనిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇలాంటి సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని గంటా నూకరాజు అన్నారు.   కార్యాలయాలకు,కరెంటు  స్థంబాలకు,గోడలకు పార్టీ రంగులు వేసేందుకు,తీసేందుకు  వందల కోట్లు ఖర్చు పెట్టేoదుకు డబ్బులు ఉంటాయి గాని ప్రజారోగ్యం కోసం ఉపయోగపడే వ్యాక్సిన్స్ కొనడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవా అని ప్రశ్నించారు.రోజుకు 20వేలకు పైగా కేసులు రాష్ట్రంలో వస్తున్నా ,మరణాలు రేట్లు విపరీతంగా పెరుగుతున్న ముఖ్యమంత్రి మాత్రం మంగళగిరి కార్యాలయం వదలి రారని అన్నారు.   రాష్ట్రమంతా కోవిడ్ ఆసుపత్రులలో ఆక్సిజన్ లేక రోగులు మరనిస్తుంటే ఏ జిల్లాకు ముఖ్యమంత్రి వెళ్లి ఏమి జరుగుతుందో చూడరని,ప్రజలు ఇంతలా భయాందోళనకు గురవుతున్నప్పటికి  రాజకీయాలమీదే జ్యాస తప్ప ప్రజారోగ్యం మీద లేదని అన్నారు.104కి ఫోన్ చేస్తే 3గంటల్లో కోవిడ్ రోగికి బెడ్ ఏర్పాటు చేస్తారని ముఖ్యమంత్రి చెబుతారు.. ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో 50శాతం బెడ్లు కోవిడ్ బెడ్లుగా మార్చాలని ముఖ్యమంత్రి చెబుతారు.. ఆక్సిజన్ లేక ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ శనిపోలేదని సాక్ష్యాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కే తప్పుడు నివేదికలు ఇస్తారు.. మీరు చెప్పేది ఏదీ నిజం ముఖ్యమంత్రి అని నేను అడుగుతున్నాను.చెప్పే వాటికి ఆచరణలో జరిగేవాటికి సంబంధం లేకుండా చేయడంలో మీరు ఉద్దండులని అన్నారు. పిట్టల్లా జనాలు రాలిపోతుంటే కనీశం చలనం లేకుండా ఉన్న ముఖ్యమంత్రి మీరు తప్ప ఈ దేశంలో ఎవరూ ఉండరని గంటా నూకరాజు అన్నారు.   ఇళ్ల నిర్మాణం అంటారు,బడులకు సెలవులు ఇచ్చి  విద్యాదీవెన అని అంటారు.కరోనా విలయతాండవం చేస్తుంటే పరీక్షలు పెడతామంటారు కానీ ప్రజారోగ్యం పట్టదా అని గంటా నూకరాజు నిలదీశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...