Followers

నేడే వంద పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం

నేడే వంద పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం 

పార్వతీపురం,  పెన్ పవర్

 పార్వతీపురం డివిజన్ పరిధిలో రోజు రోజుకు వందల సంఖ్యలో పెరిగిపోతున్న కరోనా కేసుల మూలంగా ఆసుపత్రులలో బెడ్లు ఖాళీ లేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బాధితులకు సకాలంలో వైద్యం అందించేందుకు గాను పార్వతీపురం డివిజన్లో "కోవిడ్ కేర్ సెంటర్" ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల చర్యలు తీసుకున్న సందర్భంగాను ఈరోజు ఉదయం శాసన సభ్యులు అలజంగి జోగారావు, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అర్ కూర్మనాధం, ఎంపీడీవో, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి పార్వతీపురం మండలం నర్సిపురం  గ్రామం రెవెన్యూ పరిధిలో గల జనహిత డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన "వంద పడకల కోవిడ్ కేర్ సెంటర్" ను పరిశీలన చేయటం జరిగినది. కేర్ సెంటర్లో సమకూర్చిన మౌలిక సదుపాయాలు పరిశీలనలో భాగంగా వారితో కలసి శాసన సభ్యులు కేంద్రంలో పడకలను, మంచి నీటి సరఫరా, విద్యుత్ వంటి సదుపాయాలను పరిశీలన చేసి అందరికీ మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయా తదితర అంశాల పై అరా తీశారు, అలానే కేంద్రంలో  24 గంటలూ నీరు, విద్యుత్ అందుబాటులో ఉండేటట్లు చూడాలి అని ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు మాట్లాడుతూ క్వారైంటిన్ కేంద్రం తక్షణమే ప్రారంభించేందుకు చర్యలు తీసుకొవాలని ఇంకా అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరితగతిన ఏర్పాటు చేయవలసిందిగా రెవెన్యూ అధికారులకు శాసన సభ్యులు సూచించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్పందిస్తూ ఆదివారం ఉదయానికి ఈ సెంటర్ కోవిడ్ సేవలకు అందుబాటులోకి రానుందని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక్కడ వంద పడకలను ఏర్పాటు చేయడం జరిగినది అని తెలియపరిచారు. ఈ పర్యటనలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, రెవెన్యూ అధికారులు, ఎంపీడీవో, పోలీస్ అధికారులు, సిబ్బంది, డైట్ కళాశాల కరస్పాండెంట్ పల్లి భాను ప్రకాష్, వైసిపి సీనియర్ నాయకులు ఎక్స్ వైస్ చైర్మన్ బి జయబాబు, నాయకులు ఆర్ వి ఎస్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...