Followers

బాధిత కుటుంబానికి ట్రాస్మా చేయూత

 బాధిత కుటుంబానికి ట్రాస్మా చేయూత...

బోథ్, పెన్ పవర్ 

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో గత శుక్రవారం కరెంట్ షాక్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం అయిన ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ దాసరి గంగయ్య ను మంగళవారం నాడు బోథ్ మండల ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ట్రాస్మా పరామర్శించి, సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా బాధితుడు తోటి సహాయ కరస్పాండెంట్ గంగయ్య కు మనోధైర్యం అందించారు. అలాగే 7000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించారు.కరోనా మహమ్మారి తో గత రెండు సంవత్సరాలుగా ప్రయివేటు పాఠశాలలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటి కి తోటి కరస్పాండెంట్ ను ఆపత్ కాల సమయంలో ఆదుకోవలనే సదుద్దేశంతో ఆర్థిక సహాయం చేయడం సంతోషం కలిగించందని బాధితుడు దాసరి గంగయ్య ట్రాస్మా సబ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోథ్ మండలంలోని అన్నిప్రయివేటు పాఠశాలల కరస్పాండెంట్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...