అర్హులైన వారికి పింఛనులు మంజూరు
పెన్ పవర్, ఆలమూరు
నూతనంగా మంజూరైన ఇరవై మంది లబ్ధిదారులకు పెన్షన్లు శనివారం గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనువాస్ అందజేశారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పించన్లు మంజూరు చేయడమే లక్ష్యంగా వైఎస్సార్ సిపి ప్రభుత్వం పని చేస్తుందని సోంత ప్రయోజనాలు చూసుకోకుండా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పేద,బడుగు బలహీన వర్గాల వారికి మా వైఎస్సార్ పార్టీ అండగా ఉంటుంది అని తెలియజేసారు అలాగే కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి సత్యనారాయణ, వైసిపి సీనియర్ నాయకుడు అడబాల వీర్రాజు, తమ్మన గోపి,మాజీ సర్పంచ్ వీరవెంకట్రావు, సూరిబాబు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment