చందనోత్సవానికి సన్నద్ధత
కోవిడ్ -19 దృశ్యా ముందు జాగ్రత్తల్లో భాగంగా ఆదివారం (02-05-21) నుంచి సింహాచలం ఆలయంలో భక్తులకు మధ్యాహ్నం 2:30 గంటల వరకే దర్శనాలు కల్పించాలని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈవో ఎం.వీ సూర్యకళ , ఇతర అధికారులు నిర్ణయించారు. ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు మాత్రమే భక్తులను ఆలయంలోపలికి అనుమతిస్తారు. అయితే స్వామివారికి జరగాల్సిన సేవలన్నీ యథాతథంగా రాత్రి 9:00 గంటలకు అంటే పవళింపు సేవ వరకు జరుగుతాయి. వాటిలో ఎలాంటి మార్పు ఉండబోదు. మొత్తం 22 మంది ఆలయ అర్చకుల్లో 14 మంది అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉన్నారు. కరోనా పాజిటివ్ కాకపోయినా ఏమాత్రం ఒంట్లో బాగలేకపోయినా, లక్షణాలు కనిపించినా ఆలయ ఈవో సూర్యకళ గారి ఆదేశాల మేరకు సెలవు ఇవ్వడం జరిగింది. వారందరికీ టెస్టులు చేశారు - ఫలితాలు రావాల్సి ఉంది. అర్చకులతోపాటు ఆలయ ఉద్యోగులందర్నీ రాబోయే చందనాత్సవానికి సన్నద్ధం చేయాలంటే ఈ కరోనా కష్టకాలంలో కొంత విశ్రాంతి అవసరమని భావించడమైనది. అందుకే భక్తులకు దర్శనాలను మధ్యాహ్నం 2:30 గంటల వరకే పరిమితం చేయడమైనది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాల్లో ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నారని గమనించగలరు. భక్తులు ఈ విషయాన్ని గమనించి స్వామివారిని ఉదయంపూట దర్శించుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment