మూర్రాట తో అమ్మవారికి పూజలు
స్థానిక పెదరెల్లి వీధి శబరి యువ జనసేవ సంఘం యువకులు ఆదివారం కరోనా వైరస్ మహమ్మారి నుండి జిల్లాని రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలని మహిళలతో కలిసి అమ్మవార్లకు మూర్రాట లతో పాదయాత్ర నిర్వహించారు. శ్రీ విజయదుర్గా అమ్మవారి కి మూర్రాటతో అమ్మవారికి చల్లదనం చేశారు. అక్కడి నుండి ముత్యాలమ్మ, నూకాలమ్మ, మరిడమ్మా లకు మూర్రాటలతో చల్లదనం చేసారు. ఈ సందర్బంగా జిల్లా నాల్గవ తరగతి అధ్యక్షులు అరుగుల తారకేశ్వరరావు మాట్లాడుతూ దేశాన్ని కరోనా మహమ్మారి కమ్మేస్తోందని, ఈ విపత్తు నుండి కాపడాలని నగరం లొ ఉన్న అమ్మవార్లకు మూర్రటలు సమర్పిచడం జరిగిందన్నారు. ప్రజలందరూ భయానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ వైరస్ ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. విధిగా మాస్క్, శానిటైజర్ ని వాడాలని, భౌతిక దూరం పాటించాల అన్నారు. ప్రభుత్వం వారి సూచనలను తప్పని సరిగా పాటించాలని కోరారు.
No comments:
Post a Comment