ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరణ.
తొర్రూరు, పెన్ పవర్కరోనా వ్యాధి పట్ల భయపడాల్సిన పని లేదని,అదే సమయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలని, ప్రముఖ సామాజికవేత్త,డాక్టర్ గడ్డం రాజు పిలుపునిచ్చారు. శనివారం మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రములోని అమ్మ హాస్పిటల్ ఆవరణలో "ఆరోగ్యమిత్ర" స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా అవగాహన పై జరిగిన కార్యక్రమంలో డాక్టర్ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడుతూ...కరొనా సెకండ్ వేవ్ జాగ్రత్తల్లో మూడు విషయాలను జాగ్రత్తగా పాటించాలని, అందులో తప్పనిసరి అయితే తప్ప బయటికి రాకుండా ఉండటం, నిరంతరం మాస్కూలు ధరించడం,సామాజిక దూరాన్ని పాటించడం, ప్రతి రెండు గంటలకు ఒకసారి సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కో వడం పాటించినట్లయితే కరొనా రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు అని తెలిపారు.అనంతరం ఆరోగ్య మిత్ర సంస్థ ఆధ్వర్యంలో కరోనా జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరించి, స్థానికులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అక్షర సేద్యం వ్యవస్థాపకులు కస్తూరి పులెందర్,డాక్టర్ పంతంగి నాగ కార్తీక్,బుదారపు శ్రీనివాస్,హాస్పిటల్ సిబ్బంది,ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment