కరోనా నిర్మూలనకు ఆటో ద్వారా ప్రసారం
మెంటాడ, పెన్ పవర్
మండల కేంద్రం మెంటాడ అక్కడ అక్కడ కరోనా కేసులు నమోదు కావడంతో సర్పంచ్ రేగిడి రాంబాబు వినూత్న ప్రసారాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కరోనా పట్ల అవగాహన కల్పించడం కష్టతరం అని గ్రామములో ఆటో ఏర్పాటు చేసి ప్రసారానికి శ్రీకారం చుట్టారు. సర్పంచ్ రాంబాబు మాట్లాడుతూ కరోనా మహమ్మారి తీవ్రంగా ఉందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, బహుదూరం పాటించాలని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వము లాక్ డౌన్, 144 సెక్షన్ అమలు చేసిందని, ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కిరానా, టిఫిన్, పాన్ షాపులు తెరిచి ఉంటాయని ప్రతి ఒక్కరూ తమకు కు కావలసిన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని, స్వచ్ఛందంగా ప్రజలు ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా ప్రబంధములు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.
No comments:
Post a Comment