కరోనా లో కాసుల కక్కుర్తి
కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ కి అడ్డేది...
సెకండ్ వెవ్ కరోనా మరణమృదంగం లో ధనిక, పేద, భేదం, లేకుండా జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కనీస వైద్య సదుపాయం అందించడం లో నిర్లక్షం వైఫల్యం కారణంగా ఆక్సిజన్ లభ్యత కొరత ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిల దోపిడికి నిరుపేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు రిమ్స్ తో సహా పలు ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులగా ప్రకటించినా కరోనా బాధితులకు ఆ స్థాయి లో వైద్యం అండటంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని ఆసుపత్రుల నుండి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో కోవిడ్ వైద్యం కోసం లక్షల్లో దోచేస్తున్నాయి.
కోవిడ్ సోకిన రోగికి ఏ వైద్యం అందిస్తున్నారు. ఏ ఇంజక్షన్ ఇస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. ఎలాగైనా ప్రాణాలు నిలవాలని ఆసుపత్రికి తీసుకెళితే తిరిగి క్షేమంగా ఇంటికి వస్తామో రామో తెలియక కోవిడ్ బాధిత కుటుంబాలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్లససంఖ్య పెంచి రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆక్షిజన్ లభ్యత పెంచి కోవిడ్ రోగుల ప్రాణాలు కాపాడాల్సిన.అవసరం ఎంతైనా ఉంది. లేదంటే కరోనా మరణ మృదoగానికి ప్రభుత్వం భాద్యత వహించాలి.
No comments:
Post a Comment