సెల్కాన్ కంపెనీ ప్రమాదం లో కార్మికుని మృతి
పరవాడ, పెన్ పవర్
ఫార్మా సిటీలో సెల్కాన్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఆదివారం రాత్రి బాయిలర్ వద్ద బొగ్గు పనులు నిర్వహిస్తుండగా గోడకూలి బాయిలర్ ఆపరేటర్ అక్కడికక్కడే మృతి చెందారు అని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ తెలియ జేశారు. మృతదేహాన్ని యాజమాన్యం విశాఖ కేజీహెచ్ తరలించింది అన్నారు.
ఈ ప్రమాదంలో మృతిచెందిన జి.తులసిరావు వయసు 32 తూర్పుగోదావరి జిల్లాకి చెందిన వ్యకి కుటుంభ పోషణార్ధం ఫార్మాసిటీ లోని సెల్కాన్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో బ్రాయిలర్ అపరేటర్ గా పనిచేస్తున్నాడు అని అన్నారు. కుటుంబానికి ఇతడే ఆధారం అని తులసిరావు మృతితో ఆ కుటుంభం ఎంతో నష్టపోయింది అని గనిశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి నష్ట పరిహారం ఉద్యోగం కల్పించాలని భద్రతా ప్రమాణాలు అమలు చెయ్యని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు ప్రభుత్వం ఇప్పటికైనా మెల్కోని భద్రతా ప్రమాణాలు అమలు చేయని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment