కరోనా పై గిరిజనులకు కళజాత మైకుల ద్వారా అవగాహన
విశాఖ ఏజెన్సీలో విజృంభిస్తున్న రెండో విడత కరోనా తీవ్రతపై గిరిజనులకు కళాజాత మైకుల ద్వారా అవగాహన కల్పిస్తామని పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ( ఐ టి డి ఎ) ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్ సలిజామల అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సెకెండ్ వేవ్ కరోనా మహమ్మారి గిరిజన ప్రాంతంలో విలయ తాండవం ఆడుతుందని దీనిని నియంత్రించేందుకు ప్రజా సహకారం అవసరం అన్నారు. ప్రజలు అధికారులు సమిష్టిగా కరోనా వైరస్ ని ఎదుర్కోవలసి ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో కరోనా మహమ్మారి పై అవగాహన కల్పించేందుకు 11 మండలాల్లో కళాజాత లు మైకులు ద్వారా ప్రచారం చేస్తామని గిరిజనులు అవగాహనతో ఉండాలన్నారు. మాస్కులు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని కోరారు. మండల కేంద్రాలకు శివారు గ్రామాలు మైళ్ల దూరంలో ఉండటం వల్ల వైద్య సేవలు సకాలంలో అందుకో లేరని గిరిజనులు కారోనా ఆ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే ఆశ కార్యకర్త ఏఎన్ఎం లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఏజెన్సీలో కొన్ని మండలాలు కర్ఫ్యూ అమలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 5వ తేదీ నుండి రెండు వారాల పాటు అమలు చేయమన్నా లాక్ డౌన్ ను పాటించాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకుంటాయి అని ఆ సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది అన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లవారు ఐదు గంటల వరకు లాక్ డౌన్ కర్ఫ్యూ అమలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను అందరూ తప్పకుండా పాటించాలని ఎవరు ఉల్లంఘించిన చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని పీవో హెచ్చరించారు. వ్యాపారులు వర్తక సంఘాలు నిబంధనలకు సహకరించాలని వెంకటేశ్వర్ అన్నారు.
No comments:
Post a Comment