మరో మధర్ తెరిస్సా.! సంధ్యా..రాణమ్మా.!
అడగనిదే అమ్మైన అన్నం పెట్టదు కానీ..
అడగకుండానే కరోనా బాధితులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది
పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి
రామగుండం , పెన్ పవర్
పాలకుర్తి మండలంలోని గుడిపల్లి మరియు కొత్తపల్లి గ్రామాలలో కోవిడ్ సోకి హోం క్వారెంటైన్ లో ఉన్న 30 మంది బాధితులకి వారు కరోనా మహామ్మారి నుండి త్వరగా కోలుకోవాలని వారి శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొంది తిరిగి ఆరోగ్యవంతులు కావాలనే ధృఢ సంకల్పంతో మీకు అండగా నేనున్నాననే మంచి మనసుతో మధర్ తెరిస్సా వంటి సేవా భావంతో శనివారం నాడు పాలకుర్తి జెడ్పీటీసి కందుల సంధ్యారాణి కరోనా పాజిటీవ్ వచ్చిన వారి ప్రతీ ఇంటింటికి తిరుగుతూ వివిధ రకాలైన పండ్లు డ్రై-ఫ్రూట్స్ పంపిణీ చేసి కరోనా నివారణ కి పలు జాగ్రత్తలు తెలియజేస్తూ సూచనలు సలహాలు చెప్పి వారిలో మనో ధైర్యాన్ని నూరి పోసింది. ఇంకా ఈ కార్యక్రమంలో గుడిపెల్లి గ్రామ సర్పంచ్ కొప్పు రాజేషం, పొరండ్ల రాజిరెడ్డి, గ్రామ శాఖ అద్యక్షులు ఊర వెంకటేష్, కొలిపాక శంకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment