ఉద్యానవన కళాశాలలో క్వారైంటిన్ కేంద్రం ఏర్పాట్లు పరిశీలన
మన ఇంటి నుండే మొదలవ్వాలి
మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆన్ని ఏర్పాట్లు
పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి
ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్
కరోనా వైరస్ రాకముందుతో పోలిస్తే మన దైనందిన కార్యక్రమాలలో ఊహించని మార్పులు వచ్చాయి. కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టెందుకు మనలో మనం ఎన్నో మార్పులు చేసుకున్నాం ఇవి రాబోయే రోజుల్లోనూ కొనసాగించాలి అందుకు ముఖ్యంగా మన ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి అని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. శనివారం ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యానవన కళాశాలలో 350 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన కోవిడ్ క్వారైంటిన్ సెంటర్లో నిర్వహిస్తున్న పనులు పరిశీలించారు. కేంద్రంలో చేపడుతున్న పనుల పై అరా తీశారు.
ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ కరోనా సోకినా ఆందోళన చెందొద్దని ధైర్యంగా ఉంటే కరోనా జయించడం సాధ్యం అన్నారు. ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరుగ కుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేంద్రంలో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా చూడాలని అన్నారు. 24 గంటలు త్రాగునీరు, విద్యుత్ కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి అన్నారు. కేంద్రంలో, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే కేంద్రం నిర్వహణకు సంబంధించి వైద్యులు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చికిత్స తీసుకుంటున్న వారికి సకాలంలో వైద్యం, నిర్దేశిత మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గరుగుబిల్లి మండల తహశీల్దార్ రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ఉద్యానవన కళాశాల ప్రిన్సిపాల్, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు సిబ్బంది, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment