Followers

మంత్రి ఈటెల రాజేందర్ పై కుట్రపూరిత ఆరోపణలు చేయడం మానుకోవాలి

 మంత్రి ఈటెల రాజేందర్ పై కుట్రపూరిత ఆరోపణలు చేయడం మానుకోవాలి

ముదిరాజ్ మహాసభ తొర్రూరు మండల అధ్యక్షులు కొత్తూరు రమేష్ ముదిరాజ్

తొర్రూరు, పెన్ పవర్

తెలంగాణ ఆకాంక్షకు జీవం పోసిన వ్యక్తుల్లో ప్రథమ శ్రేణిలో నిలిచే రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ పై నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమని, ముదిరాజ్ మహాసభ తొర్రూరు మండల అధ్యక్షులు కొత్తూరు రమేష్ ముదిరాజ్ అన్నారు. శనివారం మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని బీరప్ప నగర్ ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ లో మహాసభ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తూరు రమేష్ మాట్లాడుతూ... మంత్రి ఈటెలను బలిపశువును చేసేందుకు పలువురు నాయకులు పనిగట్టుకొని, బలమైన బీసీ నేతను టార్గెట్ చేశారని, అందుకే అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇరికించే కుట్ర చేస్తున్నారని,  విమర్శించారు. ఈటెల రాజేందర్ ను ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం నుంచి తప్పించడానికి పలువురు కుట్రలు పన్ని, మంత్రి భూములపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు.మంత్రి పై వచ్చిన ఆరోపణలపై దేశంలోని ఏ విచారణ కమిటీతో నైనా విచారణ జరిపించాలని, బహిరంగ సవాల్ విసిరిన ఈటెల ధైర్యం మెచ్చుకోదగిందన్నారు. భూకబ్జాలు వ్యవహారాల్లో తలదూర్చి విమర్శల పాలవుతున్న మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,గొంగిడి సునీతపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ ఎందుకు జరపడం లేదన్నారు.ప్రభుత్వ పెద్దలకు మంత్రి ఈటెల నచ్చడం లేదని,ఈ కుట్ర,మంత్రుల ఉద్వాసన చేస్తారనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తున్నదేనని, ఆయన పేర్కొన్నారు.కరోనా నియంత్రణకై గడిచిన ఏడాది కాలంగా మంత్రి ఈటెల ఎంతో కస్టపడి పనిచేస్తున్నారని, అన్నారు. కొవిడ్ వ్యాప్తి వేళ  వైద్య పరీక్షలు,టీకా పంపిణీతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  ఈటెల వైరస్ కట్టడికి విఫల యత్నం చేస్తున్నాడని, గుర్తు చేశారు.ఆయన శ్రమను బూడిద పాలు చేసేలా ఆరోపణలు అంట కట్టడం ఎంతవరకు సమంజసమన్నారు.నిప్పు లాంటి నికార్సైన వ్యక్తి ఈటెల పై దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబన్నారు.  ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లతోనే పార్టీలు అధికారంలోకి వస్తున్నాయని, అలాంటి బలమైన సామాజిక వర్గం నాయకున్ని అప్రతిష్ఠ పాలు చేస్తామని, చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈటెల పై చేస్తున్న కుట్రలపై ముదిరాజ్ సామాజికవర్గ ప్రతినిధులు, బీసీ నాయకులు సరైన సమయంలో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.ముదిరాజ్ ముద్దుబిడ్డ, బడుగుల బాంధవుడు, ఉద్యమ నేత ఈటెలకు ఎలాంటి అపకారం జరిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి గంధం చంద్ర మూర్తి,డివిజన్ నాయకుడు సాధు రాములు, అమ్మాపురం మత్స్య పారిశ్రామిక శాఖ అధ్యక్షులు కొత్తూరు రాజు, తొర్రూరు సొసైటీ అధ్యక్షుడు రెడ్డ బోయిన మహేష్, ఉపాధ్యక్షులు రెడ్డ బోయిన రవి, శంకర బోయిన యాకయ్య, భాషబోయిన ఉప్పలయ్య, చర్లపాలెం సొసైటీ అధ్యక్షులు పులుగుజ్జ రామచంద్రు,ఖానాపురం సొసైటీ అధ్యక్షులు నారా బోయిన సోమయ్య, రెడ్డ బోయిన దిలీప్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...