Followers

చల్లా ప్రభాకర్రావు ఆధ్వర్యంలో ఘనంగా "మే""డే" వేడుకలు...

 చల్లా ప్రభాకర్రావు ఆధ్వర్యంలో ఘనంగా "మే""డే" వేడుకలు...

పెన్ పవర్, ఆలమూరు 

కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన ఆలమూరు వైసిపి రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి, సీనియర్ నాయకులు చల్లా ప్రభాకర్రావు ఆధ్వర్యంలో మేడే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలమూరు బస్టాండ్ సెంటర్లో గల అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఎర్ర జెండాను ఎగరవేశారు. ముందుగా మహాత్మ గాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అనంతరం రిక్షా, పంచాయతీ కార్మికులకు నూతన వస్త్రాలు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8గంటల పని దినాన్ని చేపట్టాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపడుతుండగా చికాగో నగరంలో  ప్రభుత్వం కార్మికులపై కాల్పులు చేపట్టినట్టు తెలిపారు. దీంతో అనేక మంది కార్మికులు మృతి చెందారని వారి ప్రాణాల త్యాగ ఫలితమే మనం జరుపుకునే మేడే వేడుకలన్నారు. దానికి ప్రతీకగా మేడేను ప్రపంచ కార్మికుల దినంగా గుర్తించినట్టు ఆయన తెలిపారు. ప్రపంచ కార్మికులంతా ఐక్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు సర్పంచ్ నాతి లావణ్య కుమార్ రాజా, ఉప సర్పంచ్ చల్లా సీతామాలక్ష్మి భూషణం, సిపిఐ నేత కొండేటి రామకృష్ణ, గొల్లపల్లి కిరణ్, నాతి కిరణ్, అశోక్, కోలా నాని, డి.పి.రావు, ఉమా తదితరులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...