Followers

ఖాకీల కష్టం చూడవయా...!!

 ఖాకీల కష్టం చూడవయా...!!

కోవిడ్ వ్యాప్తిని అరికట్టడమే ద్యేయంగా ముందడుగు
ఎల్విన్ పేట సర్కిల్ లో ముమ్మరంగా కర్ఫ్యూ అమలు
 కర్ఫ్యూ సమయంలో వాహన రాకపోకలు బంద్
ప్రజలకోసం కరోనాతో పోలీసుల ప్రత్యక్ష యుద్ధం
ఖాకీల కష్టం వర్ణనాతీతం
ప్రజలు పోలీసులకు సహకరించాలి : ఎల్విన్ పేట సి.ఐ తిరుపతిరావు, ఎస్.ఐ కృష్ణ ప్రసాద్

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

కరోనా రెండవ దశ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ తరుణంలో ప్రభుత్వాలు కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వైరస్ ప్రభావం రోజురోజుకు వృద్ధి చెందుతూనే  ఉంది. అయినప్పటికీ ప్రజల్లో మాత్రం భయం అంతంతమాత్రముగానే ఉంది.ఈ పరిస్థితిలో ప్రస్తుతం అమలులో ఉన్న కర్ఫ్యూ కన్నా సంపూర్ణ లాక్డౌన్ తప్పనిసరని ఎందరో  మేధావుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.లాక్డౌన్ దిశగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేసే సమయం కూడా ఆసన్నమైంది.ప్రభుత్వాలు లాక్డౌన్ అని ప్రకటన చేసినవెంటనే దాని అమలుకు కీలక పాత్ర పోషించవలసింది పోలీస్ యంత్రాంగం.  కానీ వారి కష్టాలను,సేవలను గుర్తించి వారికి సహకరించడానికి  ప్రజలు ముందుకు రావాలి లేదంటే వ్యాప్తిని అరికట్టడం ఎవరితరము కాదు ఈ విపత్కర కరోనా సమయంలో  ప్రజలకు అవగాహన కల్పించి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎల్విన్ పేట సి.ఐ తిరుపతిరావు,ఎస్.ఐ కృష్ణ ప్రసాద్ తెలిపారు. కానీ ప్రజలు మాత్రం కోవిడ్ వ్యాప్తి పట్ల అవగాహనతో జాగ్రత్తగా ఉండి పోలీస్ సిబ్బందికి సహకరించాలని కోరారు.

 కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో,రాష్ట్రంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించనున్నాయి. ఇక లాక్ డౌన్ అమలు చెయ్యాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు రోడ్ల మీద ప్రయాణించే ప్రజల ఆరోగ్య రక్షణ కోసం అహర్నిశలు పని చేస్తున్నారు. అసలే ఎండా కాలం .. ఆపై కరోనా రెండవ దశ వ్యాప్తి అధికం .. కనీసం రోడ్ల మీద మనుషులు కూడా తిరగలేని  పరిస్థితి ఏర్పడబోతుంది. అందులోనూ ఏదైనా తాగటానికి, తినటానికి కూడా అవకాశం లేకుండా సర్వం బంద్ . ఇక ఇలాంటి సమయంలో ఖాకీలు లాక్ డౌన్ అమలు కోసం నానా తిప్పలు పడవలసిన సమయం ఆసన్న మవుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కరోనాకు ఎదురుగా వెళ్లి వీరోచితంగా పోరాడుతూ తమ విధులకు న్యాయం చేసే ఖాకీలపై ఎన్నో చోట్ల విమర్శలు వెల్లువగా వస్తున్నా పోలీసులు ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు పడరాని పాట్లు పడుతున్నారు.కోవిడ్ వ్యాప్తి పై అవగాహన లేని ఎంతోమంది బాధ్యత లేని మనుషులు పొలుసులపై ఎన్ని మాటలు ఆడుతున్నప్పటికి ఎవరూ బయట తిరగకుండా 24 గంటలు పహారా కాస్తునే ఉంటూ కంటి మీద కునుకు లేకుండా సేవలందిస్తునే ఉంటారు. దేశం అంతా లాక్ డౌన్ తో ప్రజలు ఇళ్లకే పరిమితం అయినా ప్రజలను రక్షించటానికి పోలీసులు రోడ్ల మీద విధులు నిర్వర్తిస్తునే ఉంటారు.

కుటుంబాలకు దూరంగా ఎండను సైతం లెక్క చెయ్యకుండా విధులలో నిమగ్నమై అత్యవసర సర్వీసులలో ముందుండే పోలీస్ సిబ్బంది  అత్యంత సాహసోపేతంగా దేశం కోసం, ప్రజల కోసం మీ భద్రత మా బాధ్యత అంటూ సేవలు అందిస్తున్నారు. పోలీసులు కరోనా వైరస్ వల్ల నెలకొన్న లాక్ డౌన్ సమయంలో కుటుంబాలకు దూరంగా ఉంటూ పహారా కాస్తున్నారు. ఎండకు ఎండుతున్నారు . 

కనీస మౌలిక సదుపాయాలు ఏమీ లేకున్నా విధి నిర్వహణలో వీరోచితంగా పని చేస్తున్నారు. తాగటానికి నీళ్ళు , తినటానికి ఆహారం కూడా దొరకని పరిస్థితులలో కూడా తమ కర్తవ్యాన్ని కొనసాగిస్తున్నారు అయినప్పటికీ ప్రజలలో మాత్రం మార్పు రావడం లేదనే చెప్పాలి. పోలీసులు ప్రజలకోసం కష్టపడి వారి జీవితాలను పణంగా పెడుతున్నా కోవిడ్ వ్యాప్తి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలగురించి అవగాహన కల్పిస్తున్నప్పటికి ప్రజలు మాత్రం వాటిని పెడచెవిన పెడుతున్నారు ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితుల వలన కోవిడ్ వస్తే వైద్యం దొరికే అవకాశం లేదు కనుక ఈ రెండవ  కోవిడ్ దశలోనైన పోలీస్ సేవలను గుర్తించి ప్రజలు కోవిడ్ పట్ల జాగ్రత్తలు పాటిస్తారని ఆశిద్దాం.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...