కరోన బారినుండి ప్రజలు బయటపడాలని ప్రార్థనలు
పవిత్రమైన రంజాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ విందు కార్యక్రమం బుధవారం వేగేశ్వరపురం గ్రామంలో జరిగింది. వేగేశ్వరపురం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ జిలాని సచివాలయ సిబ్బంది సహాయంతో కోవిడ్ ఆంక్షల నియమావళి మరియు కోవిడ్ నియంత్రణ జాగ్రత్తలు పాటించి గ్రామంలో ఉన్న 25 కుటుంబాల వారి ఇంటికి వెళ్లి ఇఫ్తార్ విందు అందజేయడం జరిగింది. వేగేశ్వరపురం గ్రామంలో ఉన్న ప్రజలందరూ కోవిడ్ బారినుండి బయటపడాలని ప్రార్ధన చేశారు.
No comments:
Post a Comment