గ్రామ గ్రామాన ఎగిరిన ఎర్ర జెండా
కార్మిక కర్షకులు హక్కుల కోసం ఉద్యమించాలి
ఘనంగా 135 వ కార్మిక దినోత్సవ వేడుకలు
సీపీఎం మండల కార్యదర్శి బొల్లం అశోక్
తొర్రూరు, పెన్ పవర్
కార్మిక కర్షకుల హక్కులకై సంఘటితంగా ఉద్యమించాలని, సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బొల్లం అశోక్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య లు పిలుపునిచ్చారు. శనివారం మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో సీపీఎం పార్టీ కార్యాలయంతో పాటు మరో మూడు చోట్ల,కంటాయపాలెం గ్రామ పార్టీ ఆధ్వర్యంలో,అమ్మాపురం, ఖానాపురం, హరిపిరాల గ్రామాలలో సీపీఎం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ... 135వ ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య, ఆర్ధిక సంక్షోభల నడుమ జరుపుకోవడం బాధాకరమని, అన్నారు. కరోన మహమ్మారి ప్రపంచ మానవాళిని కబళించడం జరుగుతుందన్నారు. భారత దేశంలో మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక అణగారిన వర్గాల రక్షణ చట్టాలను హక్కులను కాలరాస్తూ, కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తున్నారన్నారు. 75 సంవత్సరాలు కార్మికుల రక్తమాంసలతో కూడపెట్టిన ప్రభుత్వ రంగాన్ని కారు చౌకగా అంబానీ ఆధాని శతకోటీశ్వరులకు అప్పనంగా ఇస్తున్నారని విమర్శించారు. దేశంలో 6నెలల నుండి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, పోరాటం కొనసాగుతోందన్నారు.కరోన వైరస్ కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేయటలో విఫలమైందని అన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి, మాస్క్ జాగ్రతలు పాటించి, కరోన వైరస్ ని జయించాలని,పిలుపునిచ్చారు.గత సంవత్సరం ఢిల్లీ సభలకు పోయి వచ్చిన ముస్లీమ్ నిందించినా బిజెపి ప్రభుత్వం కుంభమేళా నిర్వహించి, ఉత్తరాది రాష్ట్రాలలో వైరస్ ప్రాబల్యం పెంచిందన్నారు. దోపిడి ప్రభుత్వానికి కార్మిక వర్గం ప్రతిఘటన ఉద్యమాలతో హక్కులు సాధించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎండి. యాకుబ్, మార్క సాంబయ్య, సిఐటియు మండల కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొమ్ము దేవేందర్, మార్బల్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు కాశీం, సిపిఎం కంటాయ పాలెం గ్రామ కార్యదర్శి సోమిరెడ్డి, నాయకులు తాళ్ళ వెంకటేశ్వర్లు, బోర స్వామి, అమ్మాపురం గ్రామ కార్యదర్శి డోనుక దర్గయ్య, ఖానాపురం హమాలి యూనియన్ అధ్యక్షులు రమేష్, హరిపిరాల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు తలారి చంద్రయ్య, మురళి, రాపోలు ముత్తయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తొర్రూరు మండల అధ్యక్షులు రామ నరసయ్య, కౌన్సిలర్లు మాడుగుల నట్వర్, ఏన్నమనేని శ్రీనివాసరావు, జంపా, గజానంద్, నాయకులు దొంగరి శంకర్, జై సింగ్, రమేష్, రాజేందర్, అంజయ్య, శ్రీకాంత్, శంకర్, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు సురేష్ బాబు, కార్మికులు, కర్షకులు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment