Followers

శ్రీరామ పాధక్షేత్ర గుట్ట పై శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

 శ్రీరామ పాధక్షేత్ర గుట్ట పై శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

12 కోట్లతో ఆలయ నిర్మాణానికి సన్నాహలు..

ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అంకుటిత దీక్ష

7వ, వారాల పాటు స్వామి వారికి తలనీలాలు సమర్పణ

శ్రీ వేంకటేశ్వర నిర్మాణ ట్రస్ట్ ఏర్పాటు

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్


రామగుండం, పెన్ పవర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం వేళ రామగుండం నియోజవర్గంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని శ్రీరామ పాదక్షేత్రమైన రాముని గుండాల కొండ పై స్వయంబుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సంకల్పించారు. సిఎం కేసీఆర్ జన్మదిన సంకల్పం ఫలించేలా అభినవ తిరుమల మాదిరిగా ఆలయ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అకుంటిత దీక్ష చేపట్టారు. ఆలయ నిర్మాణ సంకల్పానికి మరింత బలం చేకురాలని ఎమ్మెల్యే తలనీలాలు స్వామి వారికి సమర్పించారు. మరో ఏడు వారాల పాటు తమ తలనీలాలు స్వామి వారికి సమర్పించేందుకు ఎమ్మెల్యే సంకల్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో 12 కోట్ల వ్యయంతో శ్రీ పాదక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నాహలు మొదలు పెట్టారు. శనివారం శ్రీ పాదక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి తమ తలనీలాలను ఎమ్మెల్యే సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ పాదక్షేతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంతో ఈ ప్రాంతం వైభవంగా అభివృద్ది చెందుతుందన్నారు. ఆలయ నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారికి 7వారాలు తమ తలనీలాలు సమర్పించ నున్నానని తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం శ్రీ వేంకటేశ్వర ఆలయ ట్రస్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆలయ నిర్మాణంతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రామగుండం నియోజవర్గంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా వర్ధిలేలా స్వామి వారు దివించాలని వేడుకున్నారు. 85 లక్షలతో కొండ పై రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని ఆలయ నిర్మాణానికి స్వామివారి భక్తులు, ప్రజలు భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి ఆముల నారాయణ, నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు ఎన్.వి.రమణరెడ్డి, కుమ్మరి శ్రీనివాస్, నాయకులు బద్రి రాజన్న, ఆలయ కమిటీ సభ్యులు మేడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...