శివ సాయి నగర్ లో మౌలిక సదుపాయాలు కల్పించండి.
పెన్ పవర్, కాప్రాచర్లపల్లి డివిజన్ లోని శివ సాయి నగర్ ఫేస్ 3 సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీవాసులు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ని కలిసి కాలనీ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అక్టోబర్ లో కురిసిన వర్షాలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి స్థానంలో శాశ్వత బ్రిడ్జి నిర్మాణం జరిగేలా అదేవిధంగా త్రాగునీరు లేక అల్లాడుతున్న కాలనీ వాసుల దాహార్తిని తీర్చేందుకు వెంటనే నీటి వసతి కల్పించాలని సంబంధిత ఇంజనీరింగ్, జలమండలి అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలం నాటికి బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ ఈ ఈ కోటేశ్వరరావు తో సుభాష్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు . అసలే కరోనా కష్టకాలం పక్క కాలని వాళ్ళు తాగునీరు ఇవ్వడానికి నిరాకరిస్తూ కాదు పొమ్మంటున్నారు తాగేందుకు చుక్క నీరు లేక పిల్లాపాపలతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ అధ్యక్షురాలు విజయ, కార్యదర్శి మాధవి, ఎమ్మెల్యేకు చెప్పడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జలమండలి డీజీఎం కృష్ణ తో మాట్లాడి తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి తాగునీరు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధి ఎంపల్లి పద్మా రెడ్డి, శివ సాయి నగర్ ఫేస్ 3 సంక్షేమ సంఘం ప్రతినిధులు సత్యం, పురుషోత్తం రెడ్డి, అంజలి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment