ఘనంగా మేడే వేడుకలు
పెన్ పవర్, వలేటివారిపాలెం
వలేటివారిపాలెం కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా సిఐటియు జెండాను జిల్లా కౌన్సిల్ సభ్యులు సాధు చెన్నకేశవులు పంచాయతీ ఆఫీస్ వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1,086 లో చికాగో నగరంలో కార్మికులు పనిగంటలు తగ్గించాలని, వేతనం పెంచాలని ఉవ్వెత్తున పోరాడాలని, ఇది సహించలేని పెట్టుబడిదారీ వర్గం కార్మికుల పైన కాల్పులు జరిపి 32 మంది ప్రాణాలు బలి తీసుకుందని, కార్మికుల రక్తంతో తడిసిన గుడ్డను ఎర్రజెండా గా ఎగరవేసి కార్మిక శక్తిని చాటారని, అప్పటి నుండి ఎనిమిది గంటల పని దినం అమలు అవుతుందని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ 8 గంటలు ,12 గంటలు మారుస్తూ చట్టం చేసిందని, ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే మేడే కర్తవ్యాన్ని మన ముందు ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మాదాల రమణయ్య, సిఐటియు నాయకులు జీవిబి కుమార్, మేస్త్రి రామాంజయ్య, నాగేంద్రం, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment