Followers

ఏజెన్సీలో కరోనా నియంత్రణకు వర్తక వ్యాపార సంఘాలు సహకరించాలి

 ఏజెన్సీలో కరోనా నియంత్రణకు వర్తక వ్యాపార సంఘాలు సహకరించాలి

పెన్ పవర్, విశాఖపట్నం

 విశాఖ ఏజెన్సీలో విలయ తాండవం చేస్తున్న రెండో దశ కరోనా నియంత్రణకు వర్తక వ్యాపార సంఘాలు సహక రించాలని మానవ హక్కుల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుభా(చిన్ని) అన్నారు. సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా వ్యాపారులు వర్తక సంఘాలు నిర్లక్ష్యం వహిస్తే గిరిజనులు ప్రాణాలు కోల్పోతారని కరోనా ఉధృతి ఉన్న ప్రాంతాల్లో దుకాణాలు మూసివేసి కర్ఫ్యూ పాటించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారులు  లాభాపేక్షతో  కరోనా ఉన్న  దుకాణాలు యధావిధిగా  తెరుస్తున్నారు అని ఆమె మండిపడ్డారు. పాడేరు గోల్డ్ షాపుల పరిధిలో   నూకరాజు  కరోనాతో మృతి చెందారు. అదే లైన్ లో మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయినా గోల్డ్ షాపులు యధావిధిగా తేరి చేస్తున్నారని  ఆమె విచారం వ్యక్తం చేశారు. ఏజెన్సీ డివిజన్  కేంద్రం సెక్స్ కావడంతో ఇతర మండలాల గిరిజనులు ఏ అవసరానికి అయినా పాడేరు వచ్చి తీరాల్సిందే.  గిరిజన ప్రాంతంలో పెళ్లిళ్లు శుభకార్యాల సీజన్ కావడంతో గిరిజనులు బంగారం బట్టలు కిరాణా సామాన్లు కొనుక్కునేందుకు మండల కేంద్రాలకు వచ్చేస్తున్నారు. కరోనా కేసులు మరణాలు ఉన్న వ్యాపారులు  నిబంధనలకు విరుద్ధంగా  వ్యాపారాలు సాగిస్తున్నారని   అందువల్ల గిరిజనులు కరోనా కి గురికాక తప్పడంలేదు అన్నారు. బంగారం షాపులు 20 రోజులు స్వచ్ఛందంగా మూసివేయాలని  లేనిపక్షంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకువెళతామని ఆమె హెచ్చరించారు.  షాపులు వద్ద కోవిడ్ 19 నిబంధనలు పాటించడం లేదని గిరిజనులు అవగాహన లేక షాపులో దుకాణాల్లో కలియతిరుగుతూ సరుకులు కొనుగోలు చేస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు. అరకు పాడేరు చింతపల్లి ప్రధాన కేంద్రాల్లో వ్యాపారులు దుకాణాలు మూసివేయాలని చిన్ని  కోరుతున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...