Followers

పంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానించిన గౌడవెల్లి మాజీ సర్పంచ్

 పంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానించిన గౌడవెల్లి మాజీ సర్పంచ్

పెన్ పవర్, మేడ్చల్

ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ అప్పమ్మగారి జగన్ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ పురోభివృద్ధి లో కార్మికులు, కర్షకులదే కీలకపాత్ర అన్నారు. కార్మికులు అంటూ లేకపోతే ప్రజా జీవనం స్తంభించి పోతుంది అని అన్నారు. కరోనా కాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెంటమ్మ, వార్డ్ సభ్యులు సుదర్శన్ రెడ్డి, సదానందం గౌడ్, ప్రభాకర్ ముదిరాజ్, ప్రాథమిక వ్యవసాయ  సహకార సంఘం డైరెక్టర్లు కృష్ణ యాదవ్, గోమారం శ్రీనివాస్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...