తెలంగాణ ద్రోహి కేసిఆర్
పీసీసీ సభ్యులు దసురు నాయక్
కేసముద్రం, పెన్ పవర్తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసి అనేక విధాలుగా నష్ట పోయిన వారికి ద్రోహం చేస్తూవారిని పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులైన సమైక్యవాదులను తన చుట్టూ పెట్టుకొని బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయుటకు ప్రయత్నం చేస్తున్నాడు అని టిపిసిసి సభ్యులు దసురునాయక్ పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈటెల రాజేందర్ ను భూకబ్జా పేరుతో మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేశాడని కావాలనే ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడిని ఒక తెలంగాణ ఉద్యమ కారుడిని ఇలా చేయడం చాలా బాధాకరమని మాట్లాడారు. కానీ అవినీతి భూ కబ్జాలు చేసిన వారిపై చర్యలలో భాగంగా ఈటెల పై చర్యలు తీసుకున్నారనుకుంటే మరి సీఎం కేసీఆర్ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది భూకబ్జాలు అవినీతి చేశారని ఆరోపణలు ఉన్నాయి. మరివారి మీద ఎందుకు తీసుకోవడం లేదు అంతేగాక ఇలాంటి ఆరోపణలు తన కొడుకు కేటీఆర్ పై కూడా ఉన్నవి కెసిఆర్ కి నీతి నిజాయితీ పై నమ్మకం ఉంటే వారు అందరిపై కూడా ఉన్నత అధికారులతో కమిటీలు వేసి వెంటనే మంత్రి పదవి నుండి తొలగించి విచారణ చేయించినట్లయితే పారదర్శకతను పాటించినట్లు అవుతుంది. లేనిచో కేవలం 24 గంటలలోపే విచారణ పూర్తి కావాలని ప్రభుత్వం కుట్రపూరితంగా నే ఈటెల పై కెసిఆర్ దాడి చేసినట్లే అవుతుంది అని అన్నారు. అంతేగాని ఈటల రాజేందర్ పైనే కాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
No comments:
Post a Comment