వ్యవసాయ కూలీలకు మాస్కులు పై అవగాహన
వి.ఆర్.పురం మండలం చింత రేవు పల్లి గ్రామం చుట్టుప్రక్కల పొలాల్లో రైతులు మిర్చి తోటలు వేసినారు. పెద్ద మట్టపల్లి చుట్టుపక్కల గ్రామ ప్రజలు వ్యవసాయ మిర్చికూలి పనులు చేసుకొనుటకు వస్తూ ఉంటారు. ఇది గమనించిన చిన్న మట్టపల్లి పంచాయతీ సర్పంచ్ పిట్టా రామారావు మిర్చి పనికి వచ్చిన కూలీలకు కోవిడ్ పై అవగాహన తెలియజేస్తున్నారు. మిర్చి పనికి వచ్చే కూలీలకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. మనిషి మనిషికి దూరం పాటించాలి. డెటాల్ సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇంట్లో నుంచి బయటికి రావాలనుకుంటే పని ఉంటేనే బయటకు రావాలి. కొంతమంది మా స్కూలు ధరించకుండా పనిలోకి వస్తున్నారు. అలా రాకూడదని గ్రామ ప్రజలకు పిట్ట రామారావు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కూలీలు సర్పంచ్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment