మల్లాపూర్ డివిజన్ లో ఘనంగా మేడే వేడుకలు
తార్నాక, పెన్ పవర్తెరాస కార్మిక విభాగం కాప్రా సర్కిల్ అధ్యక్షులు కుర్మన్న ఆధ్వర్యంలో మల్లాపూర్ డివిజన్ లో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి అతిధిగా స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి హాజర్యయారు. ఈ సందర్బంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రామికులు, కార్మికుల్లో మేడే కొత్త స్ఫూర్తిని రగిలించాలని పన్నాల దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు. కార్మికుల్లో చైతన్యం వెల్లివిరియాలన్నారు. శ్రమ దోపిడీని అరికట్టేందుకు ఉద్యమ స్పూర్తితో పోరాడాలన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవమన్నారు. తెలంగాణ ప్రభుత్వం అసంఘటిత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. ప్రస్తుత కరోనా పరిస్తుతుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయక విధులు నిర్వహిస్తున్న మున్సిపల్, గ్రామ పంచాయతీ పారిశుద్ద కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.. ఈ సందర్భంగా కార్మిక, కర్షక, శ్రమజీవుల లోకానికి దేవేందర్ రెడ్డి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో డివిజన్ ప్రధాన కార్యదర్శి తాండ వాసుదేవ్ గౌడ్ , డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు సానాల రవి చారి , శ్రవణ్ , జిఎచ్ఎంసి కార్మికులు గోవెర్దన్ రెడ్డి , మల్లేష్ , నరసింహ , తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment